Sprouts Curry: టెస్టీ టెస్టీ పెసర మొలకల కూరని సింపుల్ గా తయారు చేసుకోండి ఇలా.. రెసిపీ మీ కోసం..
ప్రోటీన్, పైబర్ అధికంగా ఉండే మొలకలను అల్పాహారంగా తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే ఈ మొలకలను చిన్న పిల్లలలు తినడానికి ఇష్టపడరు. దీంతో పెద్దలు ఆరోగ్యకరమైన ఆహారమైన మొలకలు తినడం లేదంటూ వాపోతారు కూడా.. అటువంటి వారు కూడా మొలకలను తినేలా చేయవచ్చు. మొలకలతో రుచికరమైన కూరని తయారు చేయవచ్చు. ఈ మొలకల కూరని పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఈ రోజు చాలా ఈజీగా మొలకలతో కూర తయారు చేయడం ఎలా.. రెసిపీని తెలుసుకుందాం..
అల్పాహారంగా అత్యంత ఈజీగా తయారు చేసుకునే వాటిల్లో మొలకలు ఒకటి. పప్పు ధాన్యాలను నానబెట్టి బట్టలో చుట్టి.. మొలకలను తయారు చేస్తారు. అంటే మొలకెత్తిన విత్తనాలని మొలక అంటారు. ఇవి చాలా బలవర్ధకమైన ఆహరం. ప్రోటీన్, పైబర్ అధికంగా ఉండే మొలకలను అల్పాహారంగా తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే ఈ మొలకలను చిన్న పిల్లలలు తినడానికి ఇష్టపడరు. దీంతో పెద్దలు ఆరోగ్యకరమైన ఆహారమైన మొలకలు తినడం లేదంటూ వాపోతారు కూడా.. అటువంటి వారు కూడా మొలకలను తినేలా చేయవచ్చు. మొలకలతో రుచికరమైన కూరని తయారు చేయవచ్చు. ఈ మొలకల కూరని పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఈ రోజు చాలా ఈజీగా మొలకలతో కూర తయారు చేయడం ఎలా.. రెసిపీని తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు:
పెసర మొలకలు- ఒక కప్పు
టమోటా – ఒకటి (పేస్ట్)
ఉల్లిపాయ – చిన్నగా తరిగిన ముక్కలు
పచ్చి మిర్చి – మూడు( నిలువుగా కట్ చేయాలి)
ధనియాల పొడి – అర స్పూను
మిరియాల పొడి – కొంచెం
పెరుగు – అర కప్పు
జీలకర్ర – అర స్పూను
ఎండుమిర్చి – ఒకటి
బిర్యానీ ఆకు – ఒకటి
వెల్లుల్లి అల్లం పేస్ట్ – ఒక టీస్పూన్
కసూరి మేథీ – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు -చిటికెడు
కారం – అర స్పూను
దాల్చినచెక్క- కొంచం
యాలకులు – 3
లవంగాలు -3
నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర – కొంచెం
తయారీ విధానం: ముందుగా ఒక కప్పు పెసలను నీటిలో నానబెట్టి అవి నానిన తర్వాత నీరు తీసి ఒక గుడ్డలో చుట్టుకోవాలి. ఇవి మొలకలు వచ్చిన తర్వాత తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఆ పెసర మొలకలను ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని .. నీటిని వేసి కడిగి తర్వాత కొంచెం నీరు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. పెసర మొలకలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కకు పెట్టుకోవాలి. పెసలు చల్లారిన తర్వాత అందులో పెరుగు, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర, కసూరి మెంతి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాణలి పెట్టి మూడు లేదా నాలుగు స్పూన్ల నూనే వేసుకుని వేడి చేయాలి. ఇప్పుడు అందులో బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించండి. తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి బాగా వేయించండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి.. పసుపు, కారం వేసి ఒక్కసారి మెదిపి తర్వాత ఇందులో టమాటా పేస్ట్ ని వేసి బాగా వేయించండి. ఈ మిశ్రమం బాగా వేగిన తర్వాత అందులో కొంచెం నీరు పోస్ది దగ్గరకు వచ్చే వరకూ ఉడికించండి. ఇప్పుడు ముందుగా మేరినేట్ చేసుకున్న మొలకలు వేసుకుని ఉడకనివ్వాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు తగినన్ని నీరు పోసుకుని ఉడకనిచ్చి.. చివరిగా కసూరి మెంతి , కొత్తిమీర వేసుకుని దింపేసుకోవాలి. అంతే టేస్టి టెస్టి పసర మొలకల కూర రెడీ. ఇది అన్నం, బిర్యానీ, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..