Dry Cough: పొడి దగ్గుని తక్కువ అంచనా వేయకండి..! తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి..
Dry Cough: వాత, పిత్త, కఫం అసమతుల్యత వల్ల పొడి దగ్గు వస్తుందని ఆయుర్వేదంలో చెబుతారు. సాధారణంగా దగ్గు ఒక వ్యక్తిని రెండు విధాలుగా ఇబ్బంది పెడుతుంది.
Dry Cough: వాత, పిత్త, కఫం అసమతుల్యత వల్ల పొడి దగ్గు వస్తుందని ఆయుర్వేదంలో చెబుతారు. సాధారణంగా దగ్గు ఒక వ్యక్తిని రెండు విధాలుగా ఇబ్బంది పెడుతుంది. మొదటి కఫం దగ్గు ఇందులో శ్లేష్మం ఎక్కువగా ఉంటుంది. రెండోది పొడి దగ్గు ఇందులో శ్లేష్మం ఉండదు కానీ గొంతులో నొప్పి, మంట ఉంటుంది. చాలా సార్లు దగ్గడం వల్ల వ్యక్తి పక్కటెముకలు కూడా గాయపడుతాయి. అయితే పొడి దగ్గు సులభంగా నయం కాదు దీంతో ఆ వ్యక్తి చాలా ఇబ్బంది పడతాడు. ఇలాంటి సమయంలో ఇంట్లో దొరికే వీటిని ఉపయోగిస్తే మంచిది. మంచి ఉపశమనం దొరుకుతుంది.
పొడి దగ్గుకి కారణాలు.. ముక్కు, గొంతులో ఏర్పడిన అలెర్జీ పొడి దగ్గుకు కారణం అవుతుంది. ఇది కాకుండా కలుషితమైన వాతావరణం, దుమ్ము లేదా మట్టి కణాలు,TB, ఉబ్బసం, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ ఇతర కారణాలు. కొన్నిసార్లు ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో కూడా పొడి దగ్గు సమస్య ఉంటుంది.
హోం రెమెడీస్
1. పొడి దగ్గుకి తేనె గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. అందువల్ల తేనెను రోజుకు రెండు నుంచి మూడు సార్లు తీసుకోవాలి. నిద్రవేళలో గోరువెచ్చని పాలలో తేనె కలిపి తాగాలి. కానీ తేనె స్వచ్ఛమైనదిగా ఉండాలి.
2. దేశీ నెయ్యిలో నల్ల మిరియాల పొడిని కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం దొరుకుతుంది. ఇది పొడి దగ్గుకి చక్కటి నివారణ.
3. తులసి ఆకుల రసం, అల్లం రసాన్ని తేనెతో కలిపి రోజుకు 4 నుంచి 5 సార్లు తీసుకోండి. ఇది గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.
4. ఒక చెంచా అల్లం రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే పొడి దగ్గు తగ్గుతుంది. కావాలంటే అల్లంను నీటిలో మరిగించి, ఫిల్టర్ చేసి, తేనె కలిపి కూడా తీసుకోవచ్చు.
5. ఉదయం, సాయంత్రం గోరు వెచ్చని నీటిలో తేలికపాటి రాతి ఉప్పు వేసి గార్గ్ చేయాలి. ఇది మంట, ఇన్ఫెక్షన్‌ని తొలగిస్తాయి.