Train Ticket: గుడ్‌న్యూస్‌.. ఇకపై రైలులో ఇతరుల టికెట్‌పై ప్రయాణించవచ్చు.. ఎలాగంటే.!

సాధారణంగా రైళ్లలో ఎవరి టికెట్‌పై వారు మాత్రమే ప్రయాణించాలి. మరొకరు ప్రయాణించడం సాధ్యం కాదు.. అయితే రైల్వే ప్రయాణీకులకు తాజాగా..

Train Ticket: గుడ్‌న్యూస్‌.. ఇకపై రైలులో ఇతరుల టికెట్‌పై ప్రయాణించవచ్చు.. ఎలాగంటే.!
Trains
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 18, 2021 | 8:23 PM

సాధారణంగా రైళ్లలో ఎవరి టికెట్‌పై వారు మాత్రమే ప్రయాణించాలి. మరొకరు ప్రయాణించడం సాధ్యం కాదు.. అయితే రైల్వే ప్రయాణీకులకు తాజాగా ఓ గుడ్ న్యూస్. ఒకరి బుక్ చేసుకున్న రైలు టికెట్‌పై ఇంకొకరు ప్రయాణించే సౌకర్యం కూడా ఉంది. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తవానికి ఒకరి టికెట్‌పైన వేరొకరు ప్రయాణించడం అసాధ్యం. కానీ టికెట్‌ ఎవరి పేరు మీద ఉందో ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆ టికెట్‌పైన ప్రయాణం చేయొచ్చు. అయితే, వారు ఎవరి టికెట్‌పై ప్రయాణిస్తున్నారో రక్త సంబధీకులై ఉండాలి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరుతో టికెట్ ఉంటే, మీరు వారి టికెట్‌లో ప్రయాణించవచ్చు. కానీ, దీని కోసం ప్రత్యేక టికెట్ జారీ చేయబడుతుంది. వేరేవారి టికెట్‌పై వెళ్లాలనుకునేవారు ఈ ప్రత్యేక టికెట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే.. రైల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు తమతో పాటు అనేక రకాల వస్తువులు తీసుకెళ్తుంటారు. ఎక్కువ లగేజీ ఉన్నప్పుడు ట్రైన్‌ బెటర్‌ అనుకుంటారు. కానీ రైల్లో కూడా అన్నిరకాల లగేజ్‌ తీసుకెళ్లకూడదు. రైల్వే నిబంధనల ప్రకారం ఎంత బరువు తమతో తీసుకెళ్లాలి, ఎలాంటి లగేజ్‌ తీసుకెళ్లాలి లాంటి కొన్ని పరిమితులు ఉన్నాయి.

రైల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు తమతో పేలుడు పదార్థాలు, ప్రమాదకరమైన వస్తువులు, ఖాళీ గ్యాస్ సిలిండర్లు, యాసిడ్ వంటి వస్తువులను తీసుకెళ్లకూడదు. వీటితో పాటు.. స్కూటర్లు, సైకిళ్లు, బైక్‌లను తీసుకెళ్లకూడదు. అయితే మెడికల్‌ సిలిండర్లు తీసుకెళ్లవచ్చు. ప్రయాణికులు ఎవరైనా తమ పెంపుడు జంతువులను తమతో తీసుకెళ్లాలనుకుంటే.. తమతో పాటు వాటికి కూడా ప్రత్యేక టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆ పెంపుడు జంతువులను తమతో సీట్లలో కూర్చోబెట్టుకోలేరు. బ్రేక్ వ్యాన్‌లో పెడతారు. అలాగే.. వ్యాపార సంబంధిత వస్తువులను సైతం తీసుకెళ్లడం నిషేధించారు. మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ట్రంక్ పెట్టె, సూట్‌కేస్, బాక్స్ లాంటివి మీతో తీసుకెళ్లవచ్చు. అయితే అవి పరిమితికి మించి పరిమాణం ఉండకూడదు.

Also Read:

Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా స్మార్ట్ .. ఏ పనైనా సజావుగా చేయాలనుకుంటారు.. అందులో మీరున్నారా!

Railway Rules: రైల్వే చట్టాల గురించి మీకు తెలుసా.! కారణం లేకుండా ట్రైన్ ఆపితే ఎన్నేళ్ల జైలు శిక్ష.?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!