AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Husband Affair: ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన భర్త.. చెప్పుతో ఉతికారేసిన భార్య..

Husband Affair: వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి. అయినా కొంతమంది మారడం లేదు. పచ్చని సంసారాలను రోడ్డు కెక్కించి అభాసుపాలవుతున్నారు.

Husband Affair: ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన భర్త.. చెప్పుతో ఉతికారేసిన భార్య..
Husband Affair
uppula Raju
|

Updated on: Oct 18, 2021 | 7:15 PM

Share

Husband Affair: వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి. అయినా కొంతమంది మారడం లేదు. పచ్చని సంసారాలను రోడ్డు కెక్కించి అభాసుపాలవుతున్నారు. తాజాగా మద్యప్రదేశ్‌లో ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. భర్త, ప్రియురాలితో జిమ్‌లో ఉండటాన్ని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని ఉతికారేసింది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తెగ కామెంట్స్‌ చేస్తున్నారు.

వీడియోలో బురఖా వేసుకున్న మహిళ మరొక మహిళను చెప్పుతో కొట్టడం మనం వీడియోలో చూడవచ్చు. అప్పుడు భర్త.. భార్యను అడ్డుకోవడానికి ప్రయత్నించడం మనం గమనించవచ్చు. అయినా కూడా ఆవేశంగా ఉన్న భార్య.. ఆ మహిళను జుట్టు పట్టుకొని చెప్పుతో ఎడాపెడా వాయిస్తుంది. అడ్డు వచ్చిన భర్తను కూడా కొడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనను గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని సదరు మహిళను శాంత పరిచారు.

అయితే ఈ సంఘటన గురించి పోలీసులు ఇలా చెప్పారు. నూర్‌మహల్ రోడ్‌లో నివసించే యువతి తన భర్త వేరొక యువతితో తిరుగుతున్నాడని గతంలో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అప్పుడు భర్తను విచారించిన పోలీసులు తాను ఎవ్వరితో తిరగడం లేదని బుకాయించాడు. అయితే భార్య ఈ విషయాన్ని విడిచిపెట్టకుండా భర్తను నిరంతరం గమనించింది. ఈ రోజు జిమ్‌లో ప్రియురాలితో ఉండటం తెలుసుకొని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆగ్రహంతో చెప్పుతో ఇద్దరిని చితకబాదింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాడు ‘డెలివరీ బాయ్’.. నేడు టీ20 ప్రపంచక‌ప్‌లో ‘హీరో’.. ప్రత్యర్ధి జట్టుకు చుక్కలు చూపించిన ఆ ప్లేయర్ ఎవరంటే!

Bangladesh: బంగ్లాదేశ్‎లో కొనసాగుతున్న హింస.. ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు!..

Moto E40: భారత మార్కెట్లోకి మోటో కొత్త ఫోన్‌ వచ్చేసింది.. రూ. 10 వేలలోపే అద్భుతమైన ఫీచర్లు..