AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాడు ‘డెలివరీ బాయ్’.. నేడు టీ20 ప్రపంచక‌ప్‌లో ‘హీరో’.. ప్రత్యర్ధి జట్టుకు చుక్కలు చూపించిన ఆ ప్లేయర్ ఎవరంటే!

క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. ప్రస్తుతం రౌండ్ 1 జరుగుతుండగా.. ఇందులో 8 జట్లు పాల్గొంటున్నాయి..

నాడు 'డెలివరీ బాయ్'.. నేడు టీ20 ప్రపంచక‌ప్‌లో 'హీరో'.. ప్రత్యర్ధి జట్టుకు చుక్కలు చూపించిన ఆ ప్లేయర్ ఎవరంటే!
Chris Greaves
Ravi Kiran
|

Updated on: Oct 22, 2021 | 9:31 PM

Share

క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. ప్రస్తుతం రౌండ్ 1 జరుగుతుండగా.. ఇందులో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఇక వీటిల్లో 4 జట్లు సూపర్ 12కి వెళ్లనున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ స్టేజిలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. బలహీనమైన జట్టు స్కాట్‌ల్యాండ్.. టీ20ల్లో ప్రపంచ నెంబర్ 6 జట్టైన బంగ్లాదేశ్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌తో నాడు ‘డెలివరీ బాయ్’గా పని చేసిన ఓ ఆటగాడు.. నేడు టీ20 ప్రపంచకప్‌లో హీరోగా మారాడు. అతడెవరో కాదు స్కాట్‌ల్యాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ గ్రీవ్స్. ఆ మ్యాచ్‌ గురించి ఒకసారి పరిశీలిస్తే..

31 ఏళ్ల క్రిస్ గ్రీవ్స్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయకముందు అమెజాన్‌లో పార్శిల్స్ డెలివరీ చేసేవాడు. అతడి అదృష్టం ఏంటో తెలియదు గానీ.. జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రెండో మ్యాచ్‌లోనే టీ20 ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్‌లో ఆడే అవకాశం దక్కించుకోవడమే కాకుండా.. హీరోగా మారాడు.

బ్యాట్‌తో పాటు బంతితోనూ విధ్వంసం సృష్టించాడు..

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్‌ల్యాండ్ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. 53 పరుగులకే 6 వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న స్కాట్‌ల్యాండ్ జట్టును క్రిస్ గ్రీవ్స్ బ్యాట్‌తో ఆదుకున్నాడు. 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో క్రిస్ గ్రీవ్స్.. బంగ్లాదేశ్ ప్రధాన బ్యాట్స్‌మెన్లను పెవిలియన్‌కు పంపి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడు 3 ఓవర్లు వేసి 19 పరుగులకు రెండు వికెట్లు తీశాడు. ఇక గ్రీవ్స్ తీసిన వికెట్లలో ఒకటి రహీమ్ కాగా, మరొకటి షకిబుల్ హాసన్.

ఇదిలా ఉంటే.. క్రిస్ గ్రీవ్స్ ఆల్‌రౌండ్ ఇన్నింగ్స్‌పై మాట్లాడుతూ స్కాట్‌ల్యాండ్ కెప్టెన్ కైల్ కోట్జెర్.. అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ”క్రిస్ గ్రీవ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడి సామర్ధ్యం గురించి అందరికీ తెలుసు. ఇక్కడికి చేరుకోవడానికి అతడు చాలా త్యాగాలు చేశాడు. అమెజాన్‌లో పార్శిల్స్ డెలివరీ చేసేవాడు. బంగ్లాదేశ్‌పై మా విజయానికి అతడే హీరో” అని పేర్కొన్నాడు.

Also Read:

ఈ 3 రాశులవారు చాలా స్మార్ట్ .. ఏ పనైనా సజావుగా చేయాలనుకుంటారు.. అందులో మీరున్నారా!

రైల్వే చట్టాల గురించి మీకు తెలుసా.! కారణం లేకుండా ట్రైన్ ఆపితే ఎన్నేళ్ల జైలు శిక్ష.?

Follow Us
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!
రైతన్నలకు తీపి కబురు.. ఈ జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు!
రైతన్నలకు తీపి కబురు.. ఈ జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు!
రెండు సెంచరీలు కొట్టినా నా ఓటు వాడికే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్
రెండు సెంచరీలు కొట్టినా నా ఓటు వాడికే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్