AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ప్రయోజనాలు ఉన్నాయని.. వీటిని ఎక్కువగా తింటున్నారా?.. ఈ హెచ్చరిక మీకే!

వేరుశెనగ( పల్లీలు)లు తినడం మన ఆరోగ్యాన్ని వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని మన అందరికీ తెలిసిన విషయమే.. వీటిలో ఉండే ప్రోటీన్, నుంచి ఆరోగ్యకరమైన కొవ్వుల వరకు ప్రతీది మన ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు సహాయపడుతాయి. అయితే ప్రయోజనాలు ఉన్నాయి కదా అని వీటిని మోతాదుకు మించి తీసుకుంటూ ఉంటారు. కానీ అలా చేయడం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

Health Tips: ప్రయోజనాలు ఉన్నాయని.. వీటిని ఎక్కువగా తింటున్నారా?.. ఈ హెచ్చరిక మీకే!
Peanut Overconsumption Risk
Anand T
|

Updated on: Aug 23, 2025 | 3:12 PM

Share

వేరుశెనగ మనందరికీ ఇష్టమైన ఆహారం. వీటిని తీసుకోవడం వల్ల వాటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు మన శరీరానికి అందుతాయి. మాంసాహారం ఎక్కువగా తినని వ్యక్తులు ప్రోటీన్ అవసరాల కోసం వేరుశెనగను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. బాదం, వాల్‌నట్, జీడిపప్పు వంటి ఇతర నట్స్‌తో పోలిస్తే దీని ధర చాలా తక్కువ. అదే సమయంలో, మిగతా నట్స్‌లో దొరికే అన్ని పోశకాలు ఈ వేరుశెనగలో కూడా ఉంటాయి. తక్కువ ధరకు అధిక శక్తిని అందించే ఈ వేరుశెనగలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, వాటిని అధిక మొతాదులో తీసుకోవడం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: ఈ ఒక్క చిట్కాతో అందమైన.. నిగారించే చర్మం మీ సొంతం!.. తప్పక ట్రై చేయండి!

వేరుశెనగలు ఎక్కువగా తినడం వల్ల కలిగే సమస్యలు

  • వేరుశనగలో కేలరీలు, కొవ్వు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు మంచివే అయినప్పటికీ, వీటిని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల శరీరంలో అదనపు కేలరీలు చేరి, వేగంగా బరువు పెరుగుతారు. కాబట్టి, డైట్ చేసేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
  • తడి, సరిగ్గా నిల్వ చేయని వేరుశనగలపై అఫ్లాటాక్సిన్ అనే హానికరమైన ఫంగస్ పెరుగుతుంది. వాటని తినడం వల్ల కాలేయానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించడమే కాకుండా కాలేయ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. అందుకే మీరు పాత వాటిని కాకుండా తాజా, ఎండిన వేరుశెనగలను మాత్రమే తినాలి.

ఇది కూడా చదవండిరాగి పాత్రలో నీరు తాగేటప్పుడు.. ఈ నాలుగు తప్పులు అస్సులు చేయకండి!

  • వేరుశనగలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ, ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది, అంతేకాకుండా గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తుంది.
  • కొంతమందికి వేరుశెనగలు తినడం అలెర్జీగా ఉంటుంది. అయితే, వారు వేరుశెనగలు తీసుకుంటే, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు వాపు వంటి తీవ్రమైన లక్షణాలను ఎదుర్కోవచ్చు. ఇది ప్రమాదకరమైనది కాబట్టి, అలెర్జీలు ఉన్నవారు వేరుశనగలకు దూరంగా ఉండడం మంచిది.
  • వేరుశెనగలోని భాస్వరం శరీరం జింక్, ఐరన్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది, ఇది శరీరంలో పోషక అసమతుల్యతకు దారితీస్తుంది.

ఇది కూడా చదవండిగుడ్డు vs పనీర్: దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది?.. ఏది తినడం బెస్ట్‌?

మీరు మీ ఆరోగ్యం కోసం వేరుశెనగ తినాలనుకుంటే, రోజుకు ఒక గుప్పెడు (సుమారు 30 గ్రాములు) మాత్రమే తీసుకోవడం మంచిది. వాటిని ఎల్లప్పుడూ పొడి, చల్లని ప్రదేశంలో నిల్వ చేయండి. ముఖ్యంగా, మీకు ఏవైనా అనారోగ్య లక్షణాలు ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండిఏంటీ బ్లాక్ కాఫీతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..! తెలిస్తే షాక్ అవుతారు!

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.