Lifestyle: ఈ ఒక్క చిట్కాతో అందమైన.. నిగారించే చర్మం మీ సొంతం!.. తప్పక ట్రై చేయండి!
అందరి మధ్యలో అందంగా కనిపించాలి, మెరిసే అందమైన చర్మంతో అందరికి దృష్టికి ఆకర్షించాలని చాలా మంది అనుకుంటారు. అందుకు వేలల్లో, లక్షల్లో డబ్బులు ఖర్చుపెట్టి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం, లేదా మార్కెట్‌లో దొరికే ఏవేవో క్రీములు వాడటం వంటివి చేస్తుంటారు. కానీ ఎన్ని చేసినా చాలాసార్లు ఫలితం ఉందదు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోబోయే ఈ కొత్త పద్ధతిని ప్రయత్నిస్తే.. మీరు కచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు. మన ఇంట్లో దొరికే పుదీనా, నిమ్మరసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మీరు మీ చర్మాన్ని మేరిసేలా చేసుకోవచ్చు, అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం.

మీరు ఏమి చేసినా, మన చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఈ మార్పులు ఖచ్చితంగా మన చర్మంపై ప్రభావాన్ని చూపుతాయి. ప్రజెంట్ డేస్‌లో చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య నిస్తేజమైన చర్మం. దీని నుంచి బయటపడి మంచి నిగారించే చర్మాన్ని పొందాలని చాలా మంది అనుకుంటారు. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేసి విఫలం అయి ఉంటారు. కానీ మన ఇంటి పరిసరాల్లో లభించే సహజమైన పుదీనా, నిమ్మరసంతో మన చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ రెండింటిని కలిపి రసం తయారు చేసుకుని త్రాగడం వల్ల. కొద్ది రోజుల్లోనే మన చర్మం నిగారింపుగా మారుతుందని చెబుతున్నాయి. అయితే ఇంట్లో ఈ రసాన్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
పుదీనా, నిమ్మరసం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
పుదీనా, నిమ్మరసం మీ చర్మ ఆరోగ్యాన్ని పెంచడానికి సహయపడుతాయి. చర్య సమస్యలకే కాదు.. వేసవి వేడి నుండి ఉపశమనం పొందడానికి కూడా ఈ రసం గొప్ప మార్గం. వీటిలో ఉండే పోషకాలు మీరు కోరుకునే మెరిసే చర్మాన్ని అందించడంలో సహాయపడతాయి. మొటిమలు ఉన్నవారికి పుదీనా చాలా మంచిది. పుదీనా ఆకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను, సాలిసిలిక్ ఆమ్లాన్ని కూడా కలిగి ఉంటాయి. కాబట్టి మీ ఆహారంలో పుదీనాను చేర్చుకోవడం ద్వారా, మీ చర్మం బిగుతగా మారడంతో పాలు సహజమైన మెరుపును పొందుతుంది. పుదీనా రసం తాగడమే కాకుండా, మీరు పుదీనాను నేరుగా మీ చర్మానికి మాస్క్ రూపంలో కూడా అప్లై చేయవచ్చు.
నిమ్మకాయ చర్మానికి మంచిదా?
నిమ్మకాయలో మనకు విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. ఇది మీ చర్మ ఆరోగ్యానికి అత్యంత అవసరమైన విటమిన్లలో ఒకటి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, నిమ్మకాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిలో సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. బ్లాక్ హెడ్స్, మొటిమల వంటి చర్మ సమస్యలను వదిలించుకోవడానికి నిమ్మరసం చాలా మంచిది.
పుదీనా , నిమ్మరసం ఎలా తయారు చేయాలి
పుదీనా, నిమ్మరసం రసాన్ని మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు ఇంట్లో తయారు చేసుకోగల సులభమైన జ్యూస్‌లలో ఇది కూడా ఒకటి. దీన్ని తయారు చేయడానికి, ముందుగా మీరు పుదీనా ఆకులు, ఉప్పు, నిమ్మరసం, తేనె, సోంపు గింజలను బ్లెండర్‌లో కొద్దిగా నీటితో రుబ్బుకోవాలి. తరువాత ఐస్ క్యూబ్స్, దోసకాయ ముక్కలు, తులసి ఆకులు ఒక గ్లాసులో వేసుకోవాలి. తయారుచేసిన మిశ్రమాన్ని గ్లాసులో పోసి బాగా కలపండి. ఇప్పుడు మీరు ఈ రుచికరమైన రసాన్ని తాగవచ్చు. ఇలా చేయడం ద్వారా కొన్ని రోజుల్లోనే మీ చర్మం నిగారింపుగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




