AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Coffee: ఏంటీ బ్లాక్ కాఫీతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..! తెలిస్తే షాక్ అవుతారు!

బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మన అందిరికీ తెలిసిన విషయమే కానీ.. ఈ డార్క్ కాఫీ తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఈ బ్లాక్ కాఫీ తాగడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Black Coffee: ఏంటీ బ్లాక్ కాఫీతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..! తెలిస్తే షాక్ అవుతారు!
Black Coffee
Anand T
|

Updated on: Aug 21, 2025 | 10:55 PM

Share

మనలో చాలామందికి ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఈ కాఫీ ప్రజలు రెండు రకాలుగా తీసుకుంటూ ఉంటారు. ఒకటి పాటు, చక్కెరతో చేసిన కాఫీ, ఇంకొకటి చక్కరా, పాలు లేకుండా తీసుకునే బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ చేదుగా ఉంటుంది కాబట్టి చాలా మంది పాలు, చక్కెరతో చేసే కాఫీనే తాగడానికి చాలా ఇష్టపడుతారు కానీ అది మీ శరీరానికి పెద్దగా ప్రయోజనం కలిగించదు. కాబట్టి, మీరు డార్క్ కాఫీ, అంటే బ్లాక్ కాఫీ తాగితే, దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. డార్క్ కాఫీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. మీరు అలసిపోయినట్లు లేదా నీరసంగా అనిపిస్తే, మీరు బ్లాక్ కాఫీ తాగవచ్చు. డార్క్ కాఫీ తాగడం వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదు మీ బ్రెయిన్‌ కూడా చురుగ్గా పనిచేస్తుంది. దీంతో మనం చేసే పనిపై ఫోకస్‌ పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. బ్లాక్ కాఫీ మన శరీర జీవక్రియను కూడా మెరుగు పరుస్తుంది. ఇది శరీరంలోని కేలరీలను బర్న్ చేస్తుంది. అదే సమయంలో, ఇది శరీరంలోని అదనపు కొవ్వును కూడా తగ్గిస్తుంది.

జ్ఞాపకశక్తిని పెంచుతుంది

కాఫీలోని కెఫిన్ మెదడు కణాలను ఉత్తేజపరిచేందుకు సహాయపడుతుంది. కాఫీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు దృష్టి కూడా మెరుగుపడుతుంది. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు మీరు బద్ధకంగా అనిపిస్తే, మీరు బ్లాక్ కాఫీ తాగవచ్చు. బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మీ మానసిక స్థితి కూడా బాగుంటుంది.

మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది

బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీర ఇన్సులిన్ కు సెన్సిటివిటీ పెరుగుతుంది, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ కాఫీ తాగడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది

బ్లాక్ కాఫీ తాగడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఇది మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. చర్మానికి మెరుపు తీసుకురావడానికి సహాయపడుతుంది. బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పదార్థాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. అలాగే, బ్లాక్ కాఫీ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది.

(NOTE: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్‌నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి. వీటి గురించి మీకు ఏఐనా సందేహాలు ఉన్నా, లేదా వాటిని స్వీకరించే ముందు దయచేసి నిపుణులను సంప్రదించండి.)