మీ బెడ్‌రూమ్‌లో ఈ 3 వస్తువులు ఉంటే ప్రమాదమే..! వెంటనే తీసేయండి.. లేకుంటే అంతే సంగతి..!
మనకు తెలియకుండానే బెడ్ రూమ్ లోని కొన్ని వస్తువులు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. ఇవి శ్వాసకోశ సమస్యలు, వెన్నునొప్పి, అలర్జీలు కలిగిస్తాయి. నిపుణుల సూచన ప్రకారం.. వీటిని సమయానికి మార్చడం లేదా సహజమైన ప్రత్యామ్నాయాలను వాడటం వల్ల మంచి నిద్ర, ఆరోగ్యకర జీవనం సాధ్యమవుతుంది.

మీరు మీ బెడ్‌రూమ్‌లో ప్రమాదంతోనే నిద్రిస్తున్నారని మీకు తెలుసా..? దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనం రోజూ వాడే కొన్ని సాధారణ వస్తువులే ఈ ప్రమాదానికి కారణం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బెడ్‌రూమ్‌లో ఉండకూడని మూడు ముఖ్యమైన వస్తువులు. ఆ వస్తువులు ఏంటి..? అవి ఎందుకు ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం.
పాత దిండు
కొంతకాలం వాడిన తర్వాత దిండ్లలో దుమ్ము, చెమట, అలర్జీని కలిగించే క్రిములు పేరుకుపోతాయి. ఒకవేళ మీ దిండు ఒకటి లేదా రెండు సంవత్సరాల కంటే పాతదైతే.. దానిని వెంటనే మార్చడం మంచిది.
సింథటిక్ ఎయిర్ ఫ్రెషనర్స్
ఈ ఎయిర్ ఫ్రెషనర్స్ గాలిలోకి ఫ్తలేట్స్, VOCs (హానికరమైన రసాయనాలు) విడుదల చేస్తాయి. ఇవి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి శ్వాస సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. ఒక పరిశోధన ప్రకారం.. చాలా ఎయిర్ ఫ్రెషనర్లలో ఫ్తలేట్స్ ఉంటాయి. ఇవి ఆస్తమా, సంతానోత్పత్తి సమస్యలకు కూడా కారణం కావచ్చు. వీటికి బదులుగా సహజమైన ఎసెన్షియల్ ఆయిల్స్ వాడడం మంచిది.
పాత మ్యాట్రెస్
ఏడు నుంచి పది సంవత్సరాల కంటే పాత మ్యాట్రెస్ వాడటం వల్ల సరిగా నిద్ర పట్టకపోవచ్చు. దీని వల్ల దీర్ఘకాలంలో నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. అందుకే సమయానికి కొత్త మ్యాట్రెస్ మార్చుకోవడం మంచిది.
ఆరోగ్యంగా ఉండడానికి మీ బెడ్ రూమ్ ను శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ చిన్నపాటి జాగ్రత్తలతో మీ నిద్రను, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించి మీ నిద్రను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చుకోండి.




