గుడ్డు vs పనీర్: దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది?.. ఏది తినడం బెస్ట్?
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం కొన్ని సార్లు తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. దానితో పాటు కొంతమంది జిమ్‌లో చేరతారు. అయితే జిమ్‌లో వర్కౌట్స్ చేసి వారికి.. మజిల్ గ్రోత్ కావాలన్నా, లేదా బరువు తగ్గాలన్నా.. ప్రతిదానికీ ప్రోటీన్ చాలా అవసరం. ఇందుకోసం చాలా మంది గుడ్డు, పన్నీర్‌ను తీసుకుంటుంటారు. వెజిటేరియన్స్ అయితే పనీర్, నాన్‌వెజ్‌టేరియన్స్ అయితే ఎగ్స్‌ను తీసుకుంటారు. అయితే ఈ రెండింటిలో దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఏది తినడం బెస్ట్ అప్పుడు తెలుసుకుదాం.

జిమ్‌కు వెళ్లేవారు లేదా తీవ్రమైన వ్యాయామం చేసేవారు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినాల్సి ఉంటుంది. వారు ప్రోటీన్ స్మూతీలు, పనీర్, గుడ్లు తీసుకుంటారు. నాన్-వెజ్‌లో ప్రోటీన్ మంచి పరిమాణంలో లభిస్తుందని చెబుతారు. కానీ కొందరు పనీర్‌లో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయని అంటారు. దీంతో ప్రజలు తమ ఆహారంలో ఈ రెండింటినీ చేర్చుకుంటారు. అయితే పనీర్, గుడ్డు రెండింటిలో ప్రోటీన్ అధికంగానే ఉంటుంది. దీనితో పాటు, ఈ రెండింటిలోనూ వివిధ రకాల పోషకాలు లభిస్తాయి. ఇవి మన మొత్తం ఆరోగ్యానికి చాలా అవసరం.
ఇది కూడా చదవండి: మీకు ఇంతకుముందులా ఆకలి వేయట్లేదా.. అయితే జాగ్రత్త.. ఆ వ్యాధులకు సంకేతం కావచ్చు!
గుడ్డు వర్సెస్ పనీర్‌లో ఉండే పోషకాలు
గుడ్డు: గుడ్డు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. హెల్త్‌లైన్ ప్రకారం, ఒక పెద్ద ఉడికించిన గుడ్డులో రోజువారీ విలువ ప్రకారం 8 శాతం విటమిన్ ఎ, 6 శాతం ఫోలేట్, 14 శాతం విటమిన్ బి5, 23 శాతం విటమిన్ బి12, 7 శాతం భాస్వరం, 28 శాతం సెలీనియం ఉంటాయి. దీనితో పాటు, ఇందులో 78 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు ఉంటాయి.
ఇది కూడా చదవండి: జిమ్‌కు వెళ్తూ.. ప్రోటీన్ తీసుకుంటున్నారా?.. ఇది కచ్చితంగా తెలుసుకోండి!.. లేదంటే మీకే నష్టం!
పనీర్: ఇక పనీర్ విషయానికి వస్తే.. పనీర్ కూడా ఆరోగ్యానికి ఒక వరం లాంటిదని హెల్త్‌లైన్ చెబుతోంది. డేలీ వాల్యూ ప్రకారం , అర కప్పు లేదా 113 గ్రాముల తక్కువ కొవ్వులు గల పనీర్‌లో 81 కేలరీలు, 14 గ్రాముల ప్రోటీన్, 3 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటితో పాటు 1 గ్రాము కొవ్వు, విటమిన్ బి12 – 29%, సోడియం, 20 శాతం, సెలీనియం 18.5%, ఫాస్పరస్ 21.5% మరియు కాల్షియం 6% ఉంటాయి.
గుడ్డు వర్సెస్ పనీర్ దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది
ఈ రెండింటినీ పరిశీలిస్తే, గుడ్లతో పోలిస్తే పనీర్‌లో ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది. మీరు దీన్ని మీకు కావాల్సిన విధంగా వివిధ మార్గాల్లో మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఎగ్స్‌తో ఉడికించిన గుడ్లు, ఆమ్లెట్, ఎగ్ కర్రీ లేదా ఎగ్ భుర్జ్ వంటివి తయారు చేసుకొని తీసుకోవచ్చు. దీనితో పాటు, మీరు గుడ్డు లేదా పనీర్ పరాఠా లేదా శాండ్‌విచ్ కూడా తయారు చేసుకోవచ్చు. పనీర్‌ను కూడా అనేక విధాలుగా ఆహారంలో చేర్చవచ్చు. దీని నుండి శాండ్‌విచ్, సలాడ్, భుర్జీ లేదా కర్రీ తయారు చేయవచ్చు. దీనితో పాటు, పనీర్ నుండి అనేక రుచికరమైన వంటకాలు కూడా తయారు చేసుకొని తినవచ్చు. వీటిని ఎలా తీసుకున్నా మీకు ప్రోటీన్ అనేది లభిస్తుంది.
ఇది కూడా చదవండి: ఈ ఐదు లక్షణాలు కనిపిస్తే.. మీ బాడీలో కొలెస్ట్రాల్ తాండవం చేస్తున్నట్టే!
మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




