AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీకు ఇంతకుముందులా ఆకలి వేయట్లేదా.. అయితే జాగ్రత్త.. ఆ వ్యాధులకు సంకేతం కావచ్చు!

కొన్ని సార్లు చాలా మందికి సడెన్‌గా ఆకలివేయడం తగ్గిపోతుంది. ఇంతకు ముందుగా ఆకలి వేయదు. ఇది సాధారణమే అనుకొని చాలా మంది లైట్‌ తీసుకుంటారు. కానీ దీన్ని ఆస్సలు విస్మరించవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఏదైనా తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చుని అంటున్నారు. అయితే ఇలా సడెన్‌గా ఆకలి తగ్గిపోవడానికి కారణాలు ఏంటి, దానికి సరైన పరిష్కారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: మీకు ఇంతకుముందులా ఆకలి వేయట్లేదా.. అయితే జాగ్రత్త.. ఆ వ్యాధులకు సంకేతం కావచ్చు!
Loss Of Appetite
Anand T
|

Updated on: Aug 16, 2025 | 7:38 PM

Share

మీకు ఇష్టమైన ఆహారం మీ ముందు ఉన్నప్పటికీ తినాలని అనిపించకపోవడం ఎప్పుడైనా జరిగిందా? ఇంతకుముందు ఈజీగా రెండు రోటీలు తినే మీరు.. ఇప్పుడు ఒకటి తినగానే కడుపు నిండినట్టూ లేదా తినాలనిపించకపోవడం జరుగుతుందా.. చాలా మంది ఈ సమస్య అలసట, మానసిక స్థితి అని విస్మరిస్తారు. కానీ ఈ పరిస్థితి పదే పదే జరుగుతూ చాలా కాలం పాటు కొనసాగితే, దానిని తేలికగా తీసుకోవడం చాలా తప్పని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆకలి తగ్గడం కొన్నిసార్లు శరీరం లోపల జరుగుతున్న తీవ్రమైన సమస్యకు మొదటి సంకేతం కావచ్చు. వాతావరణంలో మార్పు వల్ల కూడా కొన్ని సార్లు ఆకలిపై ప్రభావం పడుతుంది.  ఉదాహరణకు, వేసవి లేదా వర్షాకాలంలో, చాలా మందిలో జీవక్రియ కొంచెం నెమ్మదిస్తుంది, దీని కారణంగా ఆకలి తగ్గుతుంది. కానీ ఈ మార్పు వారాల తరబడి కొనసాగితే, దానితో పాటు అలసట, బరువు తగ్గడం, బలహీనత వంటి సమస్యలు ఉంటే.. అది ఏదైనా పెద్ద వ్యాధికి సంకేతం కావచ్చు. మొదటగా ఆకలి తగ్గడానికి గల కారణాలు చూసుకుంటే.

జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే ఆకలి తగ్గుతుంది.

పొట్టలో పుండ్లు లేదా కాలేయ సమస్య వంటి కడుపు, జీర్ణ సంబంధిత వ్యాధులు ఆకలిని తగ్గిస్తాయి. ఈ వ్యాధులలో, తరచుగా కడుపులో భారంగా అనిపించడం, కొద్దిగా తిన్న తర్వాత కూడా నిండినట్లు అనిపించడం, కొన్నిసార్లు వాంతులు లేదా వికారం వంటివి ఉంటాయి. మరోవైపు, థైరాయిడ్ హార్మోన్ స్థాయి క్షీణించినట్లయితే, అది ఆకలిని కూడా ప్రభావితం చేస్తుంది. హైపోథైరాయిడిజంలో, జీవక్రియ నెమ్మదిస్తుంది, ఇది కూడా ఆకలిని తగ్గిస్తుంది.

ఒత్తిడిలో ఆకలి తగ్గుతుంది

ఆకలి లేకపోవడం కేవలం కడుపు లేదా థైరాయిడ్ సమస్యల వల్ల మాత్రమే కాదు, కొన్నిసార్లు ఇది మధుమేహం, మూత్రపిండాల వ్యాధి, గుండె వైఫల్యం లేదా కొన్ని రకాల క్యాన్సర్‌ల వంటి ప్రారంభ లక్షణం కూడా కావచ్చు. ఇవే కాదు నిరాశ లేదా ఆందోళన వంటి కొన్ని మానసిక ఆరోగ్య సమస్యలు కూడా కొన్నిసార్లు ఆకలిని ప్రభావితం చేస్తాయి. నిరాశలో, తరచుగా ఆహారం తినాలని అనిపించదు.

శరీరంలో మార్పుల వల్ల ఆకలి తగ్గడం

శరీరంలో ఇన్ఫెక్షన్ కూడా ఆకలి తగ్గడానికి కారణం కావచ్చు. TB (క్షయ), వైరల్ హెపటైటిస్ లేదా ఏదైనా రకమైన దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ లాగా, ఈ వ్యాధులలో శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి తన శక్తిని ఖర్చు చేస్తుంది. ఆకలి సహజంగానే తగ్గుతుంది. చాలా సార్లు ఈ వ్యాధులకు ఎక్కువ కాలం మందులు తీసుకోవడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది, ఇది కూడా ఆకలిని తగ్గిస్తుంది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి

మరి దీనికి పరిష్కారం ఏమిటి? మీ ఆకలి కొన్ని రోజులు తక్కువగా ఉండి, ఆ తర్వాత సాధారణ స్థితికి వస్తే, ఎలాంటి ప్రబ్లామ్‌ లేదు.. కానీ ఈ మార్పు 2 వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచింది. అక్కడ సూచించే రక్త పరీక్షలు, కాలేయ పనితీరు, థైరాయిడ్, చక్కెర స్థాయి పరీక్షలు అనేక విషయాలను స్పష్టం చేస్తాయి.

ఆకలి లేకపోవడం అనేది ఎల్లప్పుడూ చిన్న విషయం కాదు. ఇది శరీరం ఏదో దాగి ఉన్న సమస్య గురించి మిమ్మల్ని హెచ్చరించే మార్గం. సమయానికి సరైన చర్యలు తీసుకోవడం ద్వారా, మీరు ఈ సమస్య నుంచి ఉపసమనం పొందడమే కాకుండా.. సకాలంలో వ్యాధిని కూడా దూరంచేసుకోవచ్చు. ఆలస్యం చేయకండి, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఆహారంపై శ్రద్ధ వహించండి

  • రోజంతా చిన్న చిన్న భోజనం తినండి
  • అధిక ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి
  • నీటి కొరత ఉండనివ్వకండి
  • మీరు అలసిపోతే, తగినంత నిద్ర పొందండి.
  • మీ వైద్యుడు సూచించిన విధంగా సప్లిమెంట్లను తీసుకోండి.
  • ధ్యానం, యోగా లేదా తేలికపాటి నడకలు వంటి కార్యకలాపాలు చేయండి.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంట్‌నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందిచబడినవి. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.