- Telugu News Photo Gallery Health Tips: 4 Common Mistakes to Avoid When Drinking Water from a Copper Vessel
Health Tips: రాగి పాత్రలో నీరు తాగేటప్పుడు.. ఈ నాలుగు తప్పులు అస్సులు చేయకండి!
రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. కానీ మీరు రాగి పాత్రలో నీరు తాగే సమయంలో కొన్ని విషయాలను పాటించకపోతే, దానివల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ జరగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు .అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Updated on: Aug 18, 2025 | 11:41 PM

రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన అందరికీ తెలిసిన విషయమే, ఇలా చేయడం ద్వారా జీర్ణక్రియ మెరుగవడం, రోగనిరోధక శక్తి పెరగడం, శరీరాన్ని డిటాక్స్ చేయడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఆ పాత్రల్లోని నీటిని తాగేటప్పుడు కొన్ని పాటించకపోతే, దానివల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ జరగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

కొందరు వేడి చేసిన నీటిని రాగి పాత్రల్లో పోస్తూ ఉంటారు. ఆదే నీటిని తాగుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా కడుపునొప్పి, వాంతులు, గ్యాస్, జ్వలనం వంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు. కాబట్టి రాగి పాత్రలో సాధారణ నీటిని మాత్రమే తీసుకోవడం మంచింది.

మరికొందరు డే మొత్తం రాగి పాత్రలో ఉంచి నీటినే తాగుతూ ఉంటారు. ఇలా చేయడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రోజంతా ఆ పాత్రలోని నీటిని తాగడం వల్ల మన శరీరంలో కాపర్ శాతం పెరిగి కాపర్ టాక్సిసిటీ అనే సమస్య రావచ్చని చెబుతున్నారు. కాబట్టి ఉదయం ఖాళీ కడుపుతో ఒకటి రెండు, గ్లాసులు వాటర్ తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

కొందరు రాగి పాత్రలో నీటిని తాగిన తర్వాత దాన్ని శుభ్రం చేయకుండానే మళ్లీ నీటిని పోసి వాటిని తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆ పాత్రలో బ్యాక్టీరియా పేరుకుపోయే అవకాశం ఉందని.. ఆ వాటర్ తాగడం ద్వారా అనారోగ్య సమస్యకూడా రావచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి ప్రతి వినియోగం తర్వాత రాగి పాత్రను శుభ్రంగా కడగడం అలవాటు చేసుకోండి.

మీరు నీరు త్రాగే పాత్రలో నిమ్మరసం, వెనిగర్, చింతపండు, టమోటా రసం మొదలైన ఆమ్ల ఆహారాలను ఎప్పుడూ వేయకూడదని పోషకాహార నిపుణులు అంటున్నారు. దీనితో పాటు, పాలు లేదా ఇతర పాల ఉత్పత్తులను కూడా రాగి పాత్రలలో ఉంచకూడదని చెబుతున్నారు. రాగి పాత్రలను ప్రతిరోజూ నిమ్మకాయ, ఉప్పుతో శుభ్రం చేసి, ఉపయోగించే ముందు బాగా ఆరబెట్టడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ( గమనిక: పైన పేర్కొన్న సమాచారం నివేదికలు, ఇంటర్‌నెట్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)




