- Telugu News Photo Gallery Foot are safe in the rain, if it take lightly, the nails can get a fungal infection.
వర్షంలో పాదాలు భద్రం.. లైట్ తీసుకొంటే.. గోళ్లకు ఫంగల్ ఇన్ఫెక్షన్
వర్షం నీరు పాదాల గోర్లలో చేరితే ఎంత హానికరమో తెలుసా? వర్షం కురవడం వల్ల చాలా చోట్ల బురదతో నిండిపోయింది. అవి పాదాలకు అంటుకుంటే తీవ్ర నష్టం కలిగిస్తాయి. నీరు, బురద వల్ల గోళ్లకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే వర్షాకాలంలో పాదాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల ఎవరికైనా ఈ సమస్యలు వస్తాయి. గోళ్ల మూలల్లో మురికి పేరుకుపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తాయి..
Updated on: Aug 23, 2025 | 1:53 PM

వర్షం నీరు పాదాల గోర్లలో చేరితే ఎంత హానికరమో తెలుసా? వర్షం కురవడం వల్ల చాలా చోట్ల బురదతో నిండిపోయింది. అవి పాదాలకు అంటుకుంటే తీవ్ర నష్టం కలిగిస్తాయి. నీరు, బురద వల్ల గోళ్లకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే వర్షాకాలంలో పాదాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల ఎవరికైనా ఈ సమస్యలు వస్తాయి. గోళ్ల మూలల్లో మురికి పేరుకుపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తాయి.

అందుకే మట్టి గోళ్ళలో చేరితే విస్మరించవద్దు. ఇది కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు సంకేతం. అందుకే గోళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. పాదాలను జాగ్రత్తగా చూసుకోకపోతే, గోర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. బయటి నుంచి ఇంటికి వచ్చిన ప్రతిసారీ పాదాలను కడుక్కుంటూ ఉండాలి. పాదాలను సబ్బుతో బాగా కడగడం ద్వారా, ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని సులభంగా నివారించవచ్చు.

ఇంట్లో కూడా పాదాలను జాగ్రత్తగా చూసుకోండి. బేకింగ్ సోడాను గోరువెచ్చని నీటితో కలిపి, పాదాలను 10 నిమిషాల పాటు అందులో నానబెట్టాలి. అనంతరం పాదాలను లూఫాతో రుద్ది, శుభ్రం చేయాలి. ఇది పాదాల దుర్వాసన, మురికిని తొలగిస్తుంది.

మార్కెట్ నుంచి హిమాలయన్ పింక్ సాల్ట్ తీసుకొచ్చి, కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమంతో పాదాలను స్క్రబ్ చేయాలి. అనంతరం పాదాలను శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల పాదాల చర్మం శుభ్రంగా ఉండడంతోపాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

బకెట్‌లో సగం నీరు తీసుకుని, దానికి ఒక కప్పు వెనిగర్ కలపాలి. ఆ నీటిలో పాదాలను 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా పాదాలను వారానికి 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలి. పాదాలను కడిగిన తర్వాత, టవల్‌తో తడి తుడుచుకోవాలి. తర్వాత పాదాలకు ఫుట్ క్రీమ్ రాసుకోవాలి. ఇది పాదాల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.




