Vastu Tips: ఇంట్లో ఇలా ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయట.. ఎందుకో తెలుసా..?
వంటగది అనేది కేవలం భోజన తయారీ స్థలం మాత్రమే కాదు. ఇది కుటుంబ ఆరోగ్యం, శాంతి, బంధాలకు కేంద్రబిందువుగా పని చేస్తుంది. వాస్తు నియమాల ప్రకారం వంటగదిని ఉంచితే ఇంట్లో శుభ శక్తులు ప్రవహిస్తాయి. లేకపోతే నెగటివ్ ఎనర్జీ ఏర్పడి సంబంధాల్లో కలహాలు రావచ్చు.

ఇంటి శక్తి సరైన మార్గంలో ప్రవహించాలంటే వాస్తు నియమాలు చాలా అవసరం. వంటగది అనేది కేవలం ఆహారం తయారు చేసే చోటు కాదు. ఇది కుటుంబ ఆరోగ్యం, సంబంధాల బలానికి కేంద్రంగా నిలుస్తుంది. వంట చేసే స్థలం, దిశ, ఉపయోగించే వస్తువుల శుభ్రత ఇవన్నీ జీవితంలో శాంతిని కలిగించడంలో సహాయపడతాయి.
వాస్తు ప్రకారం వంట చేసే పాన్ సరైన స్థితిలో లేకపోతే లేదా తప్పుడు దిశలో ఉంచితే అది భార్యాభర్తల మధ్య కలహాలకు దారితీస్తుంది. మసి పట్టిన పాన్, విరిగిన పాత్రలు, కాలిపోయిన గిన్నెలు వంటగదిలో ఉండకూడదు. ఇవి ఆరోగ్యంపైనే కాకుండా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
వంటగదిలో వాడని పాత పాన్ లేదా విరిగిన పాత్రలు ఉండటం మంచిది కాదు. ఈ పాత్రలు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. దాంతో కుటుంబంలో అపార్థాలు, నమ్మక లోపాలు ఏర్పడతాయి. అటువంటి వస్తువులు వంటగదిలో ఉంటే వెంటనే తీసివేయాలి. తాజా, శుభ్రంగా ఉండే పాత్రలే వాడాలి.
వంట చేసే స్థలం శుభ్రంగా ఉండకపోతే కుటుంబ సంబంధాల్లో కలతలు వస్తాయి. నూనె, మసి పట్టిన పాత్రలు ప్రతికూల భావాలను కలిగిస్తాయి. వంటగది చక్కగా, శుభ్రంగా ఉంటే అక్కడ నుంచి సానుకూల శక్తి వెలువడుతుంది. ఇది ఇంట్లో ఆనందకరమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది.
ఆహారం తయారు చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి. వంట చేసే సమయంలో మన భావనలు ఆహారంలో కలుస్తాయి. మనసు కోపంగా ఉంటే.. ఆ ఆహారం తినే వాళ్లపై దుష్ప్రభావం చూపుతుంది. ప్రేమగా, శాంతిగా వంట చేస్తే ఆ ఆహారం కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది.
వాస్తు ప్రకారం వోక్ లేదా పెనాన్ని తప్పుడు దిశలో ఉంచడం, మురికిగా వాడడం లేదా కోపంతో వాడటం సంసార జీవితం మీద ప్రభావం చూపుతుంది. ఇది భార్యాభర్తల మధ్య వాదనలు, ఉద్రిక్తత తీసుకురాగలదు. కానీ వాస్తు నియమాల ప్రకారం వాడితే అదే వోక్ ఆనందానికి మార్గం అవుతుంది. ఇలా చిన్న చిన్న వాస్తు మార్గదర్శకాలను పాటించండం వల్ల కుటుంబంలో శాంతిని తీసుకురాగలదు.
