Kitchen Hacks: టమోటాలు తాజాగా, ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే ఈ సింపుల్ ట్రై చేసి చూడండి

ప్రతి ఒక్కరి వంటగదిలో లభించే కురగాయాల్లో ఒకటి టొమాటో,. ఇవి వంటకాల రుచిని పెంచడమే కాదు ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా ఇస్తాయి. మార్కెట్ నుంచి తెచ్చిన టొమాటోలు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా పాడైపోతూ ఉంటాయి. ఒకొక్కసారి కిలో వందరూపాయలు దాటే టమాటోలను ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి కొన్ని సింపుల్ టిప్స్

Kitchen Hacks: టమోటాలు తాజాగా, ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే ఈ సింపుల్ ట్రై చేసి చూడండి
Kitchen Hacks
Follow us
Surya Kala

|

Updated on: Dec 14, 2024 | 8:30 PM

టొమాటో భారతీయ వంటలలో ముఖ్యమైన కూరగాయలలో ఒకటి. ఎటువంటి వంటకాలు చేసినా టొమాటో వేస్తే రుచి బాగుంటుంది. అంతే కాదు ఈ టొమాటోను వంటల్లోనే కాకుండా సలాడ్స్, శాండ్‌విచ్‌లు, బర్గర్‌లు, పిజ్జాల తయారీలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. అయితే టమాటాలను నిల్వ చేయడం చాలా కష్టమైన పని. నిల్వ చేయడంలో ఏమాత్రం తేడా వచ్చినా టమోటాలు త్వరగా పాడవుతాయి. కనుక టమాటాలు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండాలంటే ఈ కొన్ని సింపుల్ టిప్స్ ను పాటించడం మంచిది.

  1. టొమాటోలను మార్కెట్ నుంచి తీసుకువచ్చిన తర్వాత వాటిని కడగవద్దు, తడిగా ఉంచవద్దు. టమాటాలు తడిగా ఉంటే.. వాటిని బాగా ఆరబెట్టి ఆపై ఫ్రిజ్లో ఉంచండి.
  2. ఇతర కూరగాయలతో కలిపి టమోటాలు ఉంచవద్దు. మిగిలిన కూరగాయల బరువుకి టమోటాలు చిదికిపోతాయి. అంతే కాదు ఇతర పండ్లు, కూరగాయలతో కలిపి టామాటాలు ఉంచితే అవి కుళ్లిపోయే అవకాశం కూడా ఎక్కువ.
  3. టొమాటోలను ఫ్రిజ్‌లో ఉంచేటప్పుడు వాటిని పేపర్‌లో చుట్టడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వలన తేమగా, పొడిగా ఉండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
  4. మార్కెట్ నుంచి తెచ్చిన టమాటాలను పసుపు నీళ్లలో కడిగి తడి లేకుండా రాబెట్టండి. తర్వాత టమాటోలు నిల్వ చేయండి. ఇలా చేస్తే టొమాటో తాజాగా ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ప్లాస్టిక్ సంచుల్లో టమోటాలు నిల్వ చేయవద్దు. టొమాటోలు తేమను కలిగి ఉన్నందున త్వరగా కుళ్ళిపోతాయి. కనుక టొమాటోలను ప్లాస్టిక్ బ్యాగులకు బదులు గాలి చొరబడని డబ్బాలు, బుట్టల్లో నిల్వ చేసుకోవడం మంచిది.
  7. వంట కోసం టొమాటోలు ఉపయోగించే సమయంలో ముందుగా పండిన టమోటాలు ఉపయోగించండి.
  8. టొమాటోలు ఎక్కువ సేపు తాజాగా ఉండాలంటే వాటిని సూర్య రశ్మి తగలని ప్రదేశంలో పెట్టండి.
  9. టొమాటోలను కొనుగోలు చేసేటప్పుడు పచ్చివి, బాగా రంగు రాని పండని టొమాటోలను కొనండి. ఇవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
  10. అతిగా పండిన టొమాటోలను కొనుగోలు చేస్తే.. వాటిని ప్యూరీగా చేసి నిల్వ చేయడం ఉత్తమం. మార్కెట్ నుంచి తెచ్చిన టమోటాలను శుభ్రం చేయండి. ఆ తర్వాత ముక్కలుగా కోసి మిక్సీలో మెత్తగా రుబ్బుకుని ప్యూరీగా చేసుకోండి. తర్వాత గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)