AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saphala Ekadashi: చేపట్టిన పనులు సఫలం కావాలంటే.. సఫల ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి..

హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీ మహా విష్ణువుకి ఏకాదశి అంటే మహా ఇష్టం. మార్గశిర మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువు కోసం ఉపవాసం ఉండి పూజిస్తారు. అంతే కాదు ఈ రోజు దానం చేయడం కూడా చాలా ముఖ్యమైనది. ఈ రోజున వేటిని దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుందో తెలుసుకుందాం.

Saphala Ekadashi: చేపట్టిన పనులు సఫలం కావాలంటే.. సఫల ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి..
Saphala Ekadashi 2024
Surya Kala
|

Updated on: Dec 14, 2024 | 7:11 PM

Share

హిందూ మతంలో ఏకాదశి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి నెలలో ఏకాదశి తిథి రెండుసార్లు వస్తుంది. మొదటి ఏకాదశి శుక్ల పక్షంలో.. రెండవది కృష్ణ పక్షంలో వస్తుంది. మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీ మహా విష్ణువుకి ఏకాదశి అంటే ఇష్టం. ఎవరైతే సఫల ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించి ఉపవాసం ఉంటారో వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారని నమ్ముతారు.

సఫల ఏకాదశి ఎప్పుడంటే

హిందూ వేద క్యాలెండర్ ప్రకారం ఈ సారి మార్గశిర మాసంలో వచ్చే సఫల ఏకాదశి తిథి డిసెంబర్ 25వ తేదీ రాత్రి 10.29 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ డిసెంబర్ 27 మధ్యాహ్నం 12:43 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో సఫల ఏకాదశి ఉపవాసం డిసెంబర్ 26న జరుపుకోవాలని చెప్పారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం సఫల ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం, ఉపవాసం ఉండటంతో పాటు దానధర్మానికి కూడా గొప్ప ప్రాముఖ్యత ఉంది.

ఈ రోజున దానం చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని ఇంట్లో సుఖసంతోషాలు లభిస్తాయని మత విశ్వాసం. కనుక సఫల ఏకాదశి రోజున ఏయే వస్తువులను దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.

సఫల ఏకాదశి రోజున ఏ వస్తువులను దానం చేయాలంటే

  1. సఫల ఏకాదశి రోజున బెల్లం దానం చేయాలి. ఈ దానం చాలా శుభప్రదం. ఈ రోజున బెల్లం దానం చేసిన వ్యక్తి మంచి ఆరోగ్యంతో ఉంటాడు.
  2. ఈ రోజు పేదలకు వెచ్చదనం ఇచ్చే బట్టలు దానం చేయడం శుభప్రదం. హిందువుల విశ్వాసం ప్రకారం ఇలా చేసిన వ్యక్తుల కోరికలు నెరవేరుతాయి.
  3. ఈ రోజున ఆహారాన్ని కూడా దానం చేయాలి. ఈ రోజున అన్నదానం చేస్తే విష్ణువు సంతోషిస్తాడు. ఈ రోజున బియ్యం, మొక్క జొన్న దానం చేయాలనే నమ్మకం కూడా ఉంది.
  4. ఈ రోజున పసుపు బట్టలు దానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. అలాగే జాతకంలో బలహీనుడైన బృహస్పతి బలవంతుడు అవుతాడు.
  5. సఫల ఏకాదశి రోజున ఉపవాసం విరమించిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కూడా శ్రేయస్కరం. భోజనం చేసిన అనంతరం బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వడం మేలు చేస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.