ఎలుకలతో ఇబ్బంది పడుతున్నారా.. విషం పెట్టేబదులు..అరటి పండుతో ఇలా ట్రై చేయండి..
ఇళ్లలోకి లేదా దుకాణాలలో ఎలుకలు చొరబడటం ఒక సాధారణ సమస్య. ఈ చిన్న జీవులు మనుషులకు నేరుగా హాని కలిగించవు. అయితే ఇవి కలిగించే నష్టం గణనీయంగా ఉంటుంది. బట్టలు, ఫర్నిచర్, పుస్తకాలను నమలడం నుంచి నిల్వ చేసిన ధాన్యాన్ని కూడా నాశనం చేస్తాయి. అంతేకాదు ఎలుకలు వ్యాధులను కూడా వ్యాపింపజేస్తాయి. దీంతో చాలా మంది ఎలకల బారి నుంచి ఉపశమనం కోసం విషం పెట్టడం, లేదా ఎలుకల బోను ఉపయోగించడం వంటి చర్యలు తీసుకుంటారు. అయితే ఎలుకలను ఇంట్లో ఉండే పదార్ధాలతోనే సహజంగా నివారించవచ్చు అని తెలుసా.. ఇవి సురక్షితమైన, ప్రభావవంతమైన చిట్కాలు.

ఎలుకలు ఇంట్లో వీరవిహారం చేస్తుంటే.. వాటిని చంపడానికి చాలా మందికి, విషం లేదా ఉచ్చులను ఏర్పాటు చేస్తారు. అయితే ఇవి సరైన చర్యలు కావు. ఎలుకలకు పెట్టే విషం ఒకొక్కసారి పిల్లలు, పెంపుడు జంతువులకు ప్రమాదాలను కలిగిస్తుంది. అందుకే చాలా మంది ఎలుకలను వదిలించుకునేందుకు సురక్షితమైన, సహజ పద్ధతుల కోసం చూస్తారు. ఈ నేపధ్యంలో ఈ రోజు ఎలుకలను ఇంట్లో ఉండే పదార్ధాలతోనే సురక్షితమైన, ప్రభావవంతమైన చిట్కాలతో నివారించవచ్చు. అరటిపండు, పసుపు, పటిక వంటి రోజువారీ పదార్థాలను ఉపయోగించి ఎలుకలను చంపకుండా వాటిని ఇంటి నుంచి దూరంగా ఉంచడంలో ప్రభావంతమైన చిట్కా.
ఆలమ్ స్ప్రే: ఎలుకలను దూరం చేయడంలో అత్యంత ప్రభావవంతమైన సహజ పరిష్కారాలలో ఒకటి పటిక. ఇది ₹10 కంటే తక్కువ ధరకు లభించే సాధారణ ఖనిజం.
దీన్ని ఎలా వాడాలంటే
నీటిలో పటికను కరిగించండి… ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో పోయాలి. తర్వాత ఈ నీటిని ఇంటి మూలలు, చెత్త నిల్వ ప్రదేశాలు లేదా ఎలుకలు తరచుగా కనిపించే ప్రదేశాలలో పిచికారీ చేయండి.
పటిక వాసన ఎలుకలను తరిమికొట్టేంత బలంగా ఉంటుంది. దీంతో ఎలుకలు ఆ ప్రదేశాలకు దూరంగా ఉంటాయి. అంతేకాదు ఆ ప్రాంతాన్ని క్రిమిసంహారక చేస్తుంది. అదనపు పరిశుభ్రతను కలిగిస్తుంది.
అరటిపండు, పసుపు, ఈనో:
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న మరో ప్రత్యేకమైన పద్ధతి అరటిపండును రెండు సాధారణ వంటగది పదార్థాలతో కలిపి ఉపయోగించడం.
బాగా పండిన అరటిపండు తీసుకుని ముక్కలుగా కోయండి.
ముక్కలపై ఈనోని చల్లండి. ఆ పైన పసుపు పొడిని ఒక పొరగా వేయండి.
ఈ మిశ్రమాన్ని మంచం కింద, మూలల్లో లేదా ఎలుకలు ప్రవేశించే అవకాశం ఉన్న చోట ఉంచండి.
ఈ మూడిటి కలయిక వలన బలమైన వాసన వస్తుంది. అది ఎలుకలను చికాకుపెడుతుంది. ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళేలా చేస్తుంది. అయితే ఈ చిట్కా ఎలుకలకు మాత్రమే కాదు దోమలు, ఈగలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఎలుకలను తరిమి కొట్టడానికి హానికరమైన రసాయనాలకు బదులుగా సహజ ఉపాయాలను ఎంచుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఇంట్లోని వస్తువులకు నష్టం జరగకుండా నిరోధించడమే కాదు కుటుంబానికి ఆరోగ్యకరమైన, శుభ్రమైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తాయి. ఈ సహజ హ్యాక్స్ సులభమైనవి. జేబుకు అనుకూలమైనవి. ఇంట్లోని ప్రతి ఒక్కరికీ సురక్షితం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








