Kitchen Hacks: డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కాలం నిల్వ చేయాలనుకుంటున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు మీకోసం..
రోజూ కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను లభిస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్‌ను సరిగ్గా నిల్వ చేయకపోతే అవి త్వరగా పాడైపోతాయి. ఖరీదైన ఈ డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలనుకుంటున్నారా.. అది కూడా వాటి రుచి పాడవకుండా నిల్వ చేసుకోవడానికి ఈ సింపుల్ చిట్కాలను పాటించి చూడండి..

డ్రై ఫ్రూట్స్ లో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటి ఖరీదు ఎక్కువ కనుక కరోనా కి ముందు సామాన్యుల కంటే ఎక్కువగా సంపన్నులే వీటిని అధికంగా తీసుకునేవారు. అయితే కరోనా వైరస్ తర్వాత ఆరోగ్యంపై డ్రై ఫ్రూట్స్ ప్రభావం అధికంగా ఉండడంతో ఇప్పడు ఖరీదుతో పనిలేకుండా ప్రతి ఒక్కరూ డ్రై ఫ్రూట్స్ ను తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. కొనుగోలు చేస్తున్నారు. ఆరోగ్య ప్రయోజనాల కారణంగా వీటిని సూపర్ ఫుడ్స్‌గా పరిగణిస్తారు. డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్లు, మినరల్స్ , ప్రోటీన్లు వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిని చాలామంది తమ రెగ్యులర్ డైట్‌లో కూడా చేర్చుకుంటున్నారు. రోజూ కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను లభిస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్‌ను సరిగ్గా నిల్వ చేయకపోతే అవి త్వరగా పాడైపోతాయి. ఖరీదైన ఈ డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలనుకుంటున్నారా.. అది కూడా వాటి రుచి పాడవకుండా నిల్వ చేసుకోవడానికి ఈ సింపుల్ చిట్కాలను పాటించి చూడండి..
గాలి చొరబడని కంటైనర్.. డ్రై ఫ్రూట్స్ ను నిల్వ చేయడానికి గాలి చొరబడని కంటైనర్ బెస్ట్ ఎంపిక. గాలి సోకని సీసాలో డ్రై ఫ్రూట్స్‌ను పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అది కూడా ఈ కంటైనర్ లోని డ్రై ఫ్రూట్స్ చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. పాడయ్యే అవకాశం తక్కువ.
చల్లని, తడి తగలని ప్రదేశంలో నిల్వ .. చాలా మంది డ్రై ఫ్రూట్స్ ను వంటగదిలో ఉంచుతారు. అయితే డ్రై ఫ్రూట్స్ ను ఎప్పుడూ చల్లని, తడి తగలని పొడి ప్రదేశాలలో ఉంచాలి. దీంతో డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ను ఎప్పుడూ సూర్య కాంతి తగిలే ప్రదేశం లో ఉంచవద్దు. ఇలా చేయడం వలన అవి త్వరగా పాడైపోతాయి.




డ్రై ఫ్రూట్స్ ను వేయించి కూడా నిల్వ చేయడం.. డ్రై ఫ్రూట్స్ జీవిత కాలాన్ని పెంచడానికి మరొక పద్దతి.. వేయించి నిల్వ చేయడం. డ్రై ఫ్రూట్స్ త్వరగా పాడైపోకుండా ఉండాలంటే.. వాటిని వేయించి సీసాలో నిల్వ చేసుకోవచ్చు. అంతేకాదు వాటిని ఓవెన్లో 5 నిమిషాలు వేడి చేసి నిల్వ చేసుకోవచ్చు. ఒకవేళ ఓవెన్ లేకపోతే.. డ్రై ఫ్రూట్స్ ను ఫ్రై పాన్‌లో వేసి వేయించాలి.
గాజు సీసాలో నిల్వ డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంచేందుకు గాజు సీసాను ఉపయోగించవచ్చు. ఇవి ప్లాస్టిక్ పాత్రల కంటే సురక్షితమైనవి. గాజు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాదు గాజు సీసాలో ఉన్న డ్రై ఫ్రూట్స్ కనిపిస్తూ ఉంటాయి. దీంతో వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిల్వ చేసుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..