Health Tips: వర్షాకాలంలో ఈ 5 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి.. లేదంటే అనారోగ్యానికి గురికాక తప్పదు

Health Tips: వర్షాకాలం అంటే అందరికి ఇష్టమే. ఈ సీజన్‌లో వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. పరిసర ప్రాంతాలన్నీ పచ్చదనం ఉట్టిపడుతాయి.

Health Tips: వర్షాకాలంలో ఈ 5 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి.. లేదంటే అనారోగ్యానికి గురికాక తప్పదు
Monsoon
Follow us
uppula Raju

|

Updated on: Aug 29, 2021 | 9:27 AM

Health Tips: వర్షాకాలం అంటే అందరికి ఇష్టమే. ఈ సీజన్‌లో వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. పరిసర ప్రాంతాలన్నీ పచ్చదనం ఉట్టిపడుతాయి. మట్టిలో తడిసిన వాసన, టీతో పకోడీల సరదా అందరికీ నచ్చుతుంది. కానీ ఈ సీజన్‌లో మనం ఎక్కువగా అనారోగ్యానికి గురవుతాం. కొద్దిగా అజాగ్రత్తగా ఉండటం వల్ల జలుబు, వైరల్ ఫీవర్‌ లాంటి ప్రమాదాలను కొని తెచ్చు్కుంటాం. అటువంటి పరిస్థితిలో వ్యాధులను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అదే సమయంలో కొందరు వ్యక్తులు కొన్ని తప్పులను చేస్తారు. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. సిట్రస్ పండ్లు తినాలి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. తద్వారా ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ పండ్లలో పులుపు కారణంగా ప్రజలు వీటిని తినడం మానుకుంటారు. దీంతో శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. సిట్రస్ పండ్ల రుచి మీకు నచ్చకపోతే రు ఆహారంలో నిమ్మరసం జోడించవచ్చు. కావాలంటే ప్రతిరోజు నిమ్మరసం తాగవచ్చు. సిట్రస్ పండ్లు కాకుండా బొప్పాయి, జామ, రెడ్ క్యాప్సికమ్ తినవచ్చు. ఈ వస్తువులన్నింటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

2. పెరుగు, మజ్జిగ వర్షాకాలంలో పేగును ఆరోగ్యంగా ఉంచడం ముఖ్యం. పెరుగు, మజ్జిగ, ఊరగాయ, కూరగాయలు పేగులోని హానికరమైన బ్యాక్టీరియాను దూరంగా సహాయపడతాయి.

3. చల్లని నీరు తాగటం మీరు మీ గొంతును కాపాడుకోవాలంటే ఫ్రిజ్‌ నుంచి చల్లటి నీరు తాగడం మానుకోవాలి. గడ్డకట్టే చల్లటి నీటికి బదులుగా మీరు కుండలోని నీటిని తాగవచ్చు. ఇది మీ దాహాన్ని మాత్రమే తీర్చదు ఇతర అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది. ఇది మీ జీవక్రియను పెంచి హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

4. సీజనల్ ఫుడ్స్‌ని విస్మరించడం వర్షాకాలంలో సీజనల్ పండ్లు, కూరగాయలు తినాలి. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అన్‌ సీజన్ పండ్లు, కూరగాయలు తినవద్దు ఎందుకుంటే ఈ సమయంలో వీటిని కృత్రిమంగా పండిస్తారు.

5. వీధి ఆహారాన్ని తినడం వర్షాకాలంలో చాలామంది టీ, పకోడీలు, వేయించిన వస్తువులను తినడానికి ఇష్టపడతారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, ఇతర వ్యాధులు సంక్రమిస్తాయి. వీధి ఆహారానికి బదులుగా ఆరోగ్యకరమైన వాటిని తినండి. ఇది కాకుండా తగినంత మొత్తంలో నీరు తాగాలి. ఎందుకంటే తేమ, చెమట కారణంగా నిర్జలీకరణ సమస్య ఉండవచ్చు. అందువల్ల ప్రతిరోజూ 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి.

Pista Benefits: పిస్తా పప్పు తినడం వల్ల 5 అద్భుత ప్రయోజనాలు..! తెలిస్తే అస్సలు వదలరు..

ఆస్ట్రేలియాలో పంజా విసురుతున్న కరోనా.. కొనసాతున్న ఆంక్షలు.. అయినా ఉపయోగం లేదు..:COVID-19 in Australia video.

IND vs ENG: లీడ్స్‌లో భారత్‌కు భారీ నష్టం.. పాయింట్ల పట్టికలో తొలిస్థానం హుష్‌కాకి.. తక్కువ పాయింట్లతో అగ్రస్థానం చేరుకున్న జట్టేదో తెలుసా?