AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunflower Seeds: పొద్దుతిరుగుడు గింజలు నేరుగా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. ముఖ్యంగా షుగర్‌కు చెక్..

Sunflower Seeds: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా అందరిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య డయాబెటిస్. శరీరంలోని షుగర్ లోని గ్లూకోజ్ స్థాయిలో హెచ్చుతగ్గులు ఏర్పడితే.. షుగర్ వ్యాధిబారిన పడతారు..

Sunflower Seeds: పొద్దుతిరుగుడు గింజలు నేరుగా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. ముఖ్యంగా షుగర్‌కు చెక్..
Sunflower Seeds
Surya Kala
|

Updated on: Aug 29, 2021 | 2:34 PM

Share

Sunflower Seeds: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా అందరిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య డయాబెటిస్. శరీరంలోని షుగర్ లోని గ్లూకోజ్ స్థాయిలో హెచ్చుతగ్గులు ఏర్పడితే.. షుగర్ వ్యాధిబారిన పడతారు. ప్రస్తుతం జీవన విధానంలో శారీరక శ్రమ తక్కువ, తీసుకునే ఆహారం, జీవన శైలి ఇవన్నీ కూడా డయాబెటిస్ సమస్యకు కారణమవుతున్నాయి. ప్రతి ఇంటిలోనూ ఒక్కరికైనా షుగర్ వ్యాధి ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఈ సమస్యకు నివారణ తప్ప.. శాశ్వత పరిష్కారం మాత్రం దొరకడం లేదు. అయితే షుగర్ వ్యాధికి చెక్ మన వంటింట్లో ఉండే పదార్ధాలు ఔషధాలు. ఇక సహజ సిద్ధంగా దొరికే పొద్దుతిరుగుడు విత్తనాలతో షుగర్ కు చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు పొద్దుతిరుగుతూ గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

ఇప్పటి వరకూ సన్ ప్లేవర్ ఆయిల్ గురించి విన్నాం.. మనలో ఎక్కువమంది వాడుతున్నారు కూడా. అయితే పొద్దుతిరుగు విత్తనాలు కూడా ఆహార పదార్థంగా ఉపయోగించవచ్చు.. వీటి రుచి చాలా బాగుంటుంది. క్యాలరీలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని పెంచే ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ పొద్దుతిరుగుడు గింజల్లో ఉన్నాయి.

పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు బూడిదరంగు లేదా నలుపు రంగులో ఉంటాయి. ఈ విత్తనాలులో మోనోసాచురేటెడ్, సాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి . అంతేకాదు ఫైబర్ కంటెంట్ కూడా అధికం. అందుకనే వీటిని తింటే.. ఎక్కువసేపు ఆకలి అనిపించదు.. డయాబెటిస్ వారికి ఈ గింజలు మంచి ఉపయోగం. అందుకనే షుగర్ వ్యాధిగ్రస్థులు తమ డైట్ లో భాగంగా పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకుంటే షుగర్ కంట్రోల్ లోకి వస్తుందని పలు అధ్యయనాలు ద్వారా తెలుస్తోంది.

ఈ గింజలను నేరుగా తినవచ్చు.. లేదా నీటిలో నానబెట్టుకుని తినవచ్చు. ఎలా పొద్దుతిరుగుడు గింజలను తిన్నా చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి. ఈ గింజలనుంచి వంట నూనె తయారు చేస్తారు. ఆహార పదార్ధాల తయారీకి ఉపయోగిస్తారు. అయితే నిజానికి పొద్దుతిరుగుడు గింజలను నూనె కంటే.. నేరుగా తింటేనే చక్కటి ఆరోగ్యఫలితాలను ఇస్తాయని అంటున్నారు.

గింజలను నేరుగా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

వీటిల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ కొవ్వు కరిగించడంలో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చక్కటి ప్రత్యామ్నాయం. *పొద్దుతిరుగుడు గింజలు కీళ్లనొప్పులు, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుజేస్తాయి. *విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. * గింజల్లో ఉన్న విటమిన్ సి .. ఫ్రీరాడికల్స్ తో పోరాడే గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. *పెద్దపేగు క్యాన్సర్ రాకుండా ఈ విత్తనాలు పనిచేస్తాయి. *అధిక రక్తపోటును నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. *వీటిల్లో ఉండే మాంగనీసు .. ఎముకలను ధృడంగా ఉంచడానికి సహాయపడతాయి. * చర్మాన్ని రక్షిస్తుంది. చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుంది.

Also Read: Moral Story In Ramayana: వస్తువులపై ప్రేమ కంటే మానవత్వం, మనుషులపై ప్రేమ గొప్పదని తెలియజెప్పిన రామాయణం