Scalp Itching: తలలో దురద చిరాకు పెడుతోందా.. ఇలా సింపుల్‌గా తగ్గించండి..

|

Jul 07, 2024 | 4:48 PM

చాలా మంది తలలో దురద పెడుతూ ఉంటుంది. రెగ్యులర్‌గా కాకపోయినా.. ఒక్కోసారి ఎక్కువగా తలలో దురద పెడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలా ఎక్కువగా అనిపిస్తుంది. జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా పెరగడం వల్ల తలలో దురద అనేది మొదలవుతుంది. అంతే కాకుండా జుట్టు బిరుసుగా, చికాకును కలిగిస్తూ ఉంటుంది. వర్షం తల మీద పడటం వల్ల కూడా ఇలా ఉంటుంది. దీంతో ఏం చేయాలా? తలపై దురదను ఎలా తగ్గించుకోవాలా..

Scalp Itching: తలలో దురద చిరాకు పెడుతోందా.. ఇలా సింపుల్‌గా తగ్గించండి..
Scalp Itching
Follow us on

చాలా మంది తలలో దురద పెడుతూ ఉంటుంది. రెగ్యులర్‌గా కాకపోయినా.. ఒక్కోసారి ఎక్కువగా తలలో దురద పెడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలా ఎక్కువగా అనిపిస్తుంది. జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా పెరగడం వల్ల తలలో దురద అనేది మొదలవుతుంది. అంతే కాకుండా జుట్టు బిరుసుగా, చికాకును కలిగిస్తూ ఉంటుంది. వర్షం తల మీద పడటం వల్ల కూడా ఇలా ఉంటుంది. దీంతో ఏం చేయాలా? తలపై దురదను ఎలా తగ్గించుకోవాలా అని చాలా మందికి అర్థం కాదు. తలపై దురదను తగ్గించుకోవడానికి ఆయిల్ పెట్టి.. తలస్నానం చేస్తారు. ఇలా ఎక్కువగా చేయలేరు. కాబట్టి మీ కోసమే బెస్ట్ హోమ్ రెమిడీస్ తీసుకొచ్చాం. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

పెరుగు:

తలలో దురద బాగా పెడితే మీరు పెరుగు పెట్టవచ్చు. తలకు పెరుగు పెట్టడం వల్ల దురద సమస్యే కాకుండా జుట్టుకు కూడా ప్రయోజన కరంగా ఉంటుంది. పెరుగు తలలో దురదను కూడా తగ్గిస్తుంది. పెరుగు మీరు డైరెక్ట్‌గా తలకు అప్లై చేయవచ్చు. చుండ్రు ఉన్నా తగ్గుతుంది.

నిమ్మరసం:

తలపై నిమ్మరసం పెట్టడం వల్ల కూడా దురద సమస్య కంట్రోల్ అవుతుంది. నిమ్మరసంలో పెరుగు కూడా కలిపి పెట్టొచ్చు. కేవలం నిమ్మరసం పెడితే.. దూది సహాయంతో తలపై అప్లై చేయండి. ఓ పావు గంట సేపు తర్వాత నీళ్లతో కడగండి. ఇలా తరచూ చేస్తే దురదతో పాటు జుట్టు ఆరోగ్యం కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

యాపిల్ సైడర్ వెనిగర్:

తలలో వచ్చే దురద సమస్యను తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా సహాయ పడుతుంది. దురదను తగ్గించడంలో ఇది ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో కొద్దిగా నీళ్లు కలిపి తలకు మొత్తం అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల దురద, చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.

మెంతి హెయిర్ మాస్క్:

జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు ఎంతో చక్కగా పని చేస్తాయి. మెంతులను నానబెట్టి పేస్టులా చేసి..తలకు అప్లై చేయాలి. మెంతులను ఉపయోగించడం వల్ల దురద, చుండ్రే కాకుండా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. బలంగా, దృఢంగా తయారవుతుంది. తలపై రక్త ప్రసరణ బాగా జరిగి.. ఒత్తిడి, తలనొప్పి వంటివి కూడా తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..