Curd: పెరుగులో ఉప్పు లేదా చక్కెర.. ఏది వేసుకుని తింటే మంచిది?

సీజన్ ఏదైనా సరే.. భోజనంలో పెరుగు ఖచ్చితంగా ఉండాలి అనుకుంటాం. కూర లేదైనా నచ్చకపోతే.. పెరుగుతో భోజనం కంప్లీట్ చేసేస్తాం. కొంత మంది మజ్జిగ తాగుతారు. కప్పులో వేసుకుని తింటారు. ఇలా ఎవరికి నచ్చిన స్టైల్లో పెరుగును తీసుకుంటూ ఉంటారు. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్.. శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో ఉండే చెడు బ్యాక్టీరియాను బయటకు పంపి..

Curd: పెరుగులో ఉప్పు లేదా చక్కెర.. ఏది వేసుకుని తింటే మంచిది?
కొన్ని పరిశోధనల ప్రకారం పెరుగు ప్రశాంతతో పాటు ఎమోషనల్ కానివ్వకుండా మెదడును సిద్ధం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి యాంగ్జైటీ రాకుండా చేస్తుంది. బ్రెయిన్ హెల్త్ కోసం ఇది నేచురల్ రెమెడీ కూడా. చాలా వరకు కూడా నోటి ద్వారా వ్యాపించే జబ్బులు బ్యాక్టీరియా వల్లనే కలుగుతాయి. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా ఇతర బ్యాక్టీరియాలను శరీరంలోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది.
Follow us
Chinni Enni

|

Updated on: Jul 16, 2024 | 6:34 PM

సీజన్ ఏదైనా సరే.. భోజనంలో పెరుగు ఖచ్చితంగా ఉండాలి అనుకుంటాం. కూర లేదైనా నచ్చకపోతే.. పెరుగుతో భోజనం కంప్లీట్ చేసేస్తాం. కొంత మంది మజ్జిగ తాగుతారు. కప్పులో వేసుకుని తింటారు. ఇలా ఎవరికి నచ్చిన స్టైల్లో పెరుగును తీసుకుంటూ ఉంటారు. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్.. శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో ఉండే చెడు బ్యాక్టీరియాను బయటకు పంపి.. మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. అయితే పెరుగులో కొంత మంది ఉప్పు వేసుకుంటే మరికొంత మంది చక్కెర వేసుకుంటారు. మరి పెరుగులో ఉప్పు లేదా చక్కెర ఏది వేసుకుని తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పుతో తింటే..

పెరుగును ఉప్పుతో కలిపి తీసుకుంటే చాలా మంచిది. అందులోనూ పెరుగులో పింక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ వేసుకుని తింటే ఇంకా బెటర్. డయాబెటీస్ ఉన్నవారు పొరపాటును కూడా పెరుగులో చక్కెర వేసుకుని తినకూడదు. రక్త పోటు ఉన్నవారు పెరుగులో ఉప్పు కలిపి తీసుకోవచ్చు. అయితే పెరుగులో ఉప్పు కలిపి తీసుకుంటే.. పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా నశిస్తుంది. ఉప్పు ఎక్కువ వేసుకుని తీసుకుంటే రక్త పోటు సమస్యలు కూడా వస్తాయి. చాలా తక్కువ ఉప్పు కలిపి తీసుకుంటేనే కొద్దిగా బెటర్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

చక్కెరతో తింటే..

పెరుగులో పంచదార కలిపి తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలా తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు కూడా మేలే. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా కూడా చావదు. అయితే ఈ కాంబినేషన్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇలా తింటే వేగంగా బరువు పెరుగుతారు. డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

పెరుగును ఎలా తీసుకుంటే మంచిది?

అసలు నిజం చెప్పాలంటే పెరుగులో ఎలాంటివి కలపకుండా తీసుకోవడం వల్లనే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదే విధంగా పెరుగులో కొద్దిగా ఉప్పు, పంచదార కలిపి తీసుకున్నా పర్వాలేదు. ఇలా తిన్నా కూడా నష్టాలు లేకపోలేదు. కాబట్టి ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి తీసుకోవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..