Kitchen Hacks: మీ ఇంటిని ఇలా క్లీన్ చేస్తే.. ఎలాంటి కీటకాలు ఇంట్లోకి రావు..

వర్షా కాలం అంటేనే వ్యాధుల కాలం అని చెప్పొచ్చు. అంతే కాకుండా క్రిమి, కీటకాలు, పురుగులు కూడా ఇంట్లోకి ఎక్కువగా వస్తాయి. వీటి వల్ల అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ప్రబలే అవకాశాలు ఎక్కువ. ఇంట్లో ఉండే ఆహారంపై వాలి.. వైరస్, బ్యాక్టీరియాలను స్ప్రెడ్ చేస్తాయి. ముఖ్యంగా ఇంట్లో చిన్నారులు ఉంటే మరింత జాగ్రత్త తప్పనిసరి. వారు అన్ని రకాల వస్తువులను పట్టుకుని నోట్లో పెట్టుకుంటారు. చిన్నారుల్లో ఇమ్యూనిటీ..

Kitchen Hacks: మీ ఇంటిని ఇలా క్లీన్ చేస్తే.. ఎలాంటి కీటకాలు ఇంట్లోకి రావు..
Kitchen Hacks
Follow us
Chinni Enni

|

Updated on: Jul 16, 2024 | 5:50 PM

వర్షా కాలం అంటేనే వ్యాధుల కాలం అని చెప్పొచ్చు. అంతే కాకుండా క్రిమి, కీటకాలు, పురుగులు కూడా ఇంట్లోకి ఎక్కువగా వస్తాయి. వీటి వల్ల అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ప్రబలే అవకాశాలు ఎక్కువ. ఇంట్లో ఉండే ఆహారంపై వాలి.. వైరస్, బ్యాక్టీరియాలను స్ప్రెడ్ చేస్తాయి. ముఖ్యంగా ఇంట్లో చిన్నారులు ఉంటే మరింత జాగ్రత్త తప్పనిసరి. వారు అన్ని రకాల వస్తువులను పట్టుకుని నోట్లో పెట్టుకుంటారు. చిన్నారుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి త్వరగా జబ్బుల బారిన పడుతూ ఉంటారు. కాబట్టి ముందు ఇంటిని క్లీన్‌గా ఉంచుకోవడం అవసరం. ఇల్లు క్లీన్‌గా ఉంటే కీటకాలు, పురుగులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇంటికి క్లీన్ చేసేటప్పుడు ఈ సారి ఈ చిట్కాలను ట్రై చేయండి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

మిరియాలు:

మిరియాలను మనం ఆహారంగా తీసుకుంటాం. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. ముఖ్యంగా వర్షా కాలంలో మిరియాలతో తయారు చేసే ఆహారాలు తీసుకుంటే సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇంటిని కడిగే సమయంలో లేదా మాప్ పెట్టేటప్పుడు మిరియాలను కూడా ఉపయోగించవచ్చు.

మిరియాలను మెత్తగా పొడిలా తయారు చేసి.. మాప్ పెట్టే నీటిలో కలపండి. మిరియాల నుంచి వచ్చే ఘాటు వాసనకు ఇంట్లోకి సూక్ష్మ క్రిములు, పురుగులు, కీటకాలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా బొద్దింకలు, పురుగులు, ఈగలు కూడా పారిపోతాయి.

ఇవి కూడా చదవండి

బేకింగ్ సోడా – వెనిగర్:

బేకింగ్ సోడా, వెనిగర్స్‌ని మనం చాలా రకాల కిచెన్ హ్యాక్స్ కింద ఉపయోగించుకోవచ్చు. మురికిని వదిలించడంలో ఇవి ఎంతో చక్కగా సహాయ పడతాయి. అంతే కాకుండా వీటితో ఇంట్లోకి కీటకాలను కూడా రాకుండా చేయవచ్చు. బేకింగ్ సోడా, వెనిగర్ సమ పాలల్లో తీసుకుని బకెట్ నీటిలో వేయాలి. బాగా కలిపి ఇంటిని తుడిచినా, కడిగినా ఇంట్లోకి పురుగులు, కీటకాలు, సూక్ష్మ క్రిములు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా ఇల్లు కూడా ఎంతో నీటిగా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..