AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : చెడు కొలెస్ట్రాల్ సమస్య వెంటాడుతోందా.. పరగడుపున ఈ జ్యూస్ తాగితే చాలు? అన్ని రోగాలు నయం!

కొత్తిమీర కేవలం ఆహారం రుచి, అలంకరణ కోసం మాత్రమే కాదు..ఇందులో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు నిండివున్నాయి. ప్రతిరోజూ కొత్తిమీర జ్యూస్‌ రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. కొత్తిమీర ఆకు, కాండం, వేరు అన్నీ ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి.. కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. కొత్తిమీరలో ఉంటే యాంటీ మైక్రోబయల్, యాంటీ మ్యూటాజెనిక్, యాంటీ ఇన్ప్లమేరటీ లక్షణాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాదు డయేరియాకు కూడా కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా నాశనం చేయడంలో తోడ్పడతాయి. కొత్తి మీర జ్యూస్‌ తో కలిగే మరిన్ని ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jul 16, 2024 | 6:20 PM

Share
కొత్తిమీరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకు నీటిని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.

1 / 5
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న కొత్తిమీర రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కొత్తిమీర రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాలతో సహా అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

2 / 5
కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారికి కొత్తిమీర జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీర నీరు తాగడం వల్ల కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అసిడిటీ సమస్య ఉన్నవారు కొత్తిమీరతో పాటు జీలకర్ర, టీఆకులు, పంచదార వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.

3 / 5
పీరియడ్స్ కు సంబంధించిన సమస్యలు ఉన్న మహిళలు, సమయానికి పీరియడ్స్ రాని వారు, లేదా సాధారణం కంటే ఎక్కువగా ఉన్నవారు కొత్తిమీర నీళ్లలో పంచదార కలిపి తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

4 / 5
కొత్తిమీర జ్యూస్ తయారు చేసుకోవడానికి కొత్తిమీర, ఒక నిమ్మకాయ, ఉప్పు, తగినన్నీ నీళ్లు అవసరం. కొత్తమీర జ్యూస్‌ కోసం ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి, దానిని కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో నిమ్మరసం, ఉప్పు వేసి కలుపుకుని తాగితే సరిపోతుంది. దీనిని ప్రతీరోజూ పరిగడుపున తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

5 / 5
Follow Us