Dates: రెండే రెండు ఖర్జూరాలతో ఫుల్ ఎనర్జీ.. ఇక ఆ విషయంలో రెచ్చిపోవాల్సిందే..

ఖర్జూరాల్లో ఎన్నో పోషకాలు, ఔషధగుణాలు దాగున్నాయి.. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే ఖర్జూరాను ప్రతీరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్రమంతప్పకుండా ప్రతీరోజూ రెండు ఖర్జురాలు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు.

Dates: రెండే రెండు ఖర్జూరాలతో ఫుల్ ఎనర్జీ.. ఇక ఆ విషయంలో రెచ్చిపోవాల్సిందే..
Health Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 16, 2024 | 7:13 PM

ఖర్జూరాల్లో ఎన్నో పోషకాలు, ఔషధగుణాలు దాగున్నాయి.. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే ఖర్జూరాను ప్రతీరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్రమంతప్పకుండా ప్రతీరోజూ రెండు ఖర్జురాలు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. ఖర్జూరాలోని సెలీనియం, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఐరన్, ఫోలేట్, ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. ఉదయం లేవగానే ఖర్జూరాలను తీసుకుంటే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

అందుకే.. ఇన్ని పోషకాలతో కూడిన ఖర్జూరం ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని.. రోజూ ఒకట్రెండు ఖర్జూరాలు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  1. ఖర్జూరంలో కరిగే, కరగని ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి.. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. మంచి ప్రేగు కదలికను ప్రోత్సహించడం ద్వారా ఖర్జూరాలు మలబద్ధకం వంటి సమస్యలను నివారించడంలో కూడా సహాయపడతాయి.
  2. ఖర్జూరంలో గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శక్తిని, సామర్థ్యాన్ని పెంచుతాయి. కాబట్టి, ఉపవాస సమయంలో ఖర్జూరం తినమని సలహా ఇస్తారు.
  3. ఖర్జూరంలో పొటాషియం ఎక్కువగానూ, సోడియం తక్కువగానూ ఉంటాయి. ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.. ఇంకా గుండెను ఆరోగ్యంగా ఉంచి స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  4. ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
  5. ఖర్జూరంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత చికిత్సలో ఇది సమర్థవంతమైన ఔషధం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  6. ఖర్జూరాలు మీ మొత్తం ఆరోగ్యానికి, లైంగిక ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే పోషకాలతో నిండి ఉన్నాయి. ఈ పండ్లలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని, సామర్థ్యాన్ని మెరుగుపర్చి లైంగిక సమస్యలను నివారిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!