AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk: మీరు వాడుతున్న పాలలో నీళ్లు కలిపారో లేదో.. ఈ సింపుల్ టెస్ట్‌తో తెలుసుకోండి..

అందుకే పాలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. అయితే ప్రస్తుత ఈ కమర్షియల్‌ ప్రపంచంలో అన్ని కల్తీగా తయారవుతున్నాయి. దీనికి పాలు కూడా మిహాయింపు ఏం కాదు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ కొందరు కేటుగాళ్లు పాలను కల్తీ చేస్తున్నారు. కొందరు ఏకంగా కృత్రిమ పాలను తయారు చేస్తుంటే మరికొందరు పాలలో నీళ్లు కలిపి అమ్మేస్తున్నారు...

Milk: మీరు వాడుతున్న పాలలో నీళ్లు కలిపారో లేదో.. ఈ సింపుల్ టెస్ట్‌తో తెలుసుకోండి..
Milk
Narender Vaitla
|

Updated on: Sep 17, 2024 | 12:01 PM

Share

ఉదయం లేవగానే కచ్చితంగా అవసరమయ్యే వాటిలో పాలు మొదటి వస్తువు. నిద్రలేవగానే పాల ప్యాకెట్‌తోనే రోజు మొదలవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరికి పాలతో సంబంధం ఉంటుంది. టీ, కాఫీ మొదలు పెరుగు వరకు ఇలా అన్నింటికీ పాలు ఉండాల్సిందే. ఇక పాలలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయని తెలిసిందే.

అందుకే పాలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. అయితే ప్రస్తుత ఈ కమర్షియల్‌ ప్రపంచంలో అన్ని కల్తీగా తయారవుతున్నాయి. దీనికి పాలు కూడా మిహాయింపు ఏం కాదు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ కొందరు కేటుగాళ్లు పాలను కల్తీ చేస్తున్నారు. కొందరు ఏకంగా కృత్రిమ పాలను తయారు చేస్తుంటే మరికొందరు పాలలో నీళ్లు కలిపి అమ్మేస్తున్నారు. కాలుషితమైన నీరును పాలలో కలపడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి.

అయితే మీరు వాడుతున్న పాలలో నీళ్లు కలిపారా.? లేదా అన్న అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఒక సింపుల్ టెస్ట్‌ను సూచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ పాల నాణ్యతను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఒక పరీక్షను సూచిస్తుంది. ఇంతకీ ఏంటా పరీక్ష పాలలో నీళ్లు కలిపారో లేదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఇందుకోసం ముందుగా ఒక పొడవాటి గ్లాస్‌ పలకను తీసుకోవాలి. అనంతరం ఆ గ్లాస్‌ను ఏటవాలుగా ఉంచి ఒకటి రెండు టీస్పూన్‌ల పాలను దానిపై దారగా పోయాలి. ఒకవేళ పాలు కిందికి నెమ్మదిగా వెళ్లూ పాల దారకు సంబంధించి మరక ఉంటే ఆ పాలు స్వచ్ఛమైనవిగా అర్థం చేసుకోవాలి. అలా కాకుండా నీరు నేరుగా వేగంగా కిందికి జారినా.. ఎలాంటి పాల మరక ఏర్పడకపోయినా అందులో నీళ్లు కలిశాయని అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్‌గా ఉంది కదూ టెస్ట్‌. మరెందుకు ఆలస్యం మీరు ఉపయోగిస్తున్న పాలలో నీళ్లు కలిపారో లేదో ఇలా సింపుల్‌గా తెలుసుకోండి. ఇందుకు సంబంధించిన వీడియోను కింద చూడండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రియురాలి కోసం పిల్లాడి పిచ్చి సాహసం.. 5ఏళ్లకే బస్సు ఎత్తుకెళ్లి
ప్రియురాలి కోసం పిల్లాడి పిచ్చి సాహసం.. 5ఏళ్లకే బస్సు ఎత్తుకెళ్లి
రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు
రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు
150 కంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే సైన్యంలోకి పంపాల్సిందే!
150 కంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే సైన్యంలోకి పంపాల్సిందే!
ఎన్టీఆర్‌కు ఇష్టమైన కారు ఇప్పుడు ఎక్కడుందో తెలుసా.?
ఎన్టీఆర్‌కు ఇష్టమైన కారు ఇప్పుడు ఎక్కడుందో తెలుసా.?
వెండిపై లోన్.. ఈ విషయాలు తెలుసుకోకపోతే మీరు నష్టపోవడం పక్కా..
వెండిపై లోన్.. ఈ విషయాలు తెలుసుకోకపోతే మీరు నష్టపోవడం పక్కా..
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
సొమ్మసిల్లిన విషసర్పానికి సపర్యలు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా
సొమ్మసిల్లిన విషసర్పానికి సపర్యలు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా
వేసవిలో బెస్ట్ హెల్తీ డ్రింక్.. రాగి పాలు.. హెల్తీగా, టేస్టీగా..
వేసవిలో బెస్ట్ హెల్తీ డ్రింక్.. రాగి పాలు.. హెల్తీగా, టేస్టీగా..
అరేయ్.. ఏంట్రా ఇదీ.. లవర్‌తో లొల్లి.. టవర్ ఎక్కి ఏం చేశాడంటే?
అరేయ్.. ఏంట్రా ఇదీ.. లవర్‌తో లొల్లి.. టవర్ ఎక్కి ఏం చేశాడంటే?
బాబా వంగా జోస్యం..వచ్చే వారం ఈ 5 రాశుల వారికి కనకవర్షం! విలాసవంతం
బాబా వంగా జోస్యం..వచ్చే వారం ఈ 5 రాశుల వారికి కనకవర్షం! విలాసవంతం