Lifestyle: స్లీవ్‌లెస్‌ డ్రస్‌ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా.?

ట్రండీగా ఉండే స్లీవ్‌లెస్‌ డ్రస్‌లు వేసుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. కేవలం మహిళలే కాకుండా పురుషులు కూడా ఈ మధ్య స్లీవ్‌లెస్‌ డ్రస్‌లను వేసుకుంటున్నారు. అయితే చాలా మంది చంకల్లో నలుపు సమస్యవల్ల ఇలాంటి డ్రస్‌లను ధరించడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే కొన్ని రకాల నేచురల్ టిప్స్‌ పాటిండం ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు..

Lifestyle: స్లీవ్‌లెస్‌ డ్రస్‌ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా.?
Lifestyle
Follow us

|

Updated on: Sep 17, 2024 | 11:10 AM

ట్రండీగా ఉండే స్లీవ్‌లెస్‌ డ్రస్‌లు వేసుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. కేవలం మహిళలే కాకుండా పురుషులు కూడా ఈ మధ్య స్లీవ్‌లెస్‌ డ్రస్‌లను వేసుకుంటున్నారు. అయితే చాలా మంది చంకల్లో నలుపు సమస్యవల్ల ఇలాంటి డ్రస్‌లను ధరించడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే కొన్ని రకాల నేచురల్ టిప్స్‌ పాటిండం ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఇంతకీ చంకల్లో నలుపుని పోగొట్టే ఆ సింపుల్‌ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* చంకల్లో నలుపు తొలగిపోయి, దుర్వాస తగ్గాలంటే చక్కెర నీళ్లు ఉపయోగపడతాయి. ఇందుకోసం నీటిలో కొంత చక్కెరను కలపాలి. అనంతరం ఆ నీటితో అండర్‌ ఆర్మ్స్‌లో మసాజ్‌ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చంకల్లో నలుపు సమస్య దూరమవుతుంది.

* చంకల్లో నలుపు సమస్యను తగ్గించడంలో టమాట రసం బాగా ఉపయోగపడుతుంది. టమాట రసాన్ని తీసుకొని దాంతో మసాజ్‌ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొన్ని రోజుల్లోనే నలుపు సమస్య నుంచి పూర్తిగా బయటపడొచ్చు.

* ఇక శనగపిండి కూడా ఇందుకు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. శనగపిండిలో కొంత నీరు కలుపుకొని మసాజ్‌ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డ్రై స్కిన్‌ సమస్య తగ్గడంతో పాటు రంగు కూడా మారుతుంది.

* ఓట్స్‌ను పిండిగా మార్చి దాంతో మసాజ్‌ చేసుకున్న ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఓట్స్‌ పిండిలో కొంత నీటిని పోసి పేస్ట్‌లాగా తయారు చేయాలి. అనంతరం దాంతో చంకల్లో మసాజ్‌ చేయడం వల్ల చర్మం రంగు క్రమంగా మారుతుంది.

* చర్మం రంగును మార్చడంలో నిమ్మకాయ రసం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంత నిమ్మరసాన్ని తీసుకొన్ని దాంతో చంకల్లో మసాజ్ చేసుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా చేస్తే చర్మం రంగు సాధారణ స్థితికి వస్తుంది.

* చంకల్లో నలుపు రంగును తగ్గించడంలో వెనిగర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒక కాటన్‌ను తీసుకొని వెనిగర్‌లో ముంచి దాంతో చంకల కింద మసాజ్‌ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లగా ఉన్న చర్మం తెల్లగా మారుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

స్లీవ్‌లెస్‌ డ్రస్‌ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా.?
స్లీవ్‌లెస్‌ డ్రస్‌ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా.?
దుస్తులపై మరకలను ఇంటి వస్తువులతోనే పోగొట్టుకోండి ఇలా..
దుస్తులపై మరకలను ఇంటి వస్తువులతోనే పోగొట్టుకోండి ఇలా..
గత రికార్డ్‌ని బీట్ చేసిన బాలాపూర్ లడ్డు ఈ ఏడాది ఎంతధర పలికిందంటే
గత రికార్డ్‌ని బీట్ చేసిన బాలాపూర్ లడ్డు ఈ ఏడాది ఎంతధర పలికిందంటే
అతడు హగ్ చేసుకుంటే కంఫర్టబుల్‏గా లేదు.. యష్మీ..
అతడు హగ్ చేసుకుంటే కంఫర్టబుల్‏గా లేదు.. యష్మీ..
బరవు తగ్గాలనుకుంటున్నారా.? వాసన పీల్చుకోండి చాలు..
బరవు తగ్గాలనుకుంటున్నారా.? వాసన పీల్చుకోండి చాలు..
వేలంలో 25 కేజీల గణపతి లడ్డూను దక్కించుకున్న టేస్టీ తేజా.. వీడియో
వేలంలో 25 కేజీల గణపతి లడ్డూను దక్కించుకున్న టేస్టీ తేజా.. వీడియో
యూపీలో శవాన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు! ఎందుకంటే.. వీడియో
యూపీలో శవాన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు! ఎందుకంటే.. వీడియో
‘గణపతి బప్ప మోరియా’ అనే నినాదాలు.. అస్సలు ఇలా ఎందుకు చేస్తారంటే.?
‘గణపతి బప్ప మోరియా’ అనే నినాదాలు.. అస్సలు ఇలా ఎందుకు చేస్తారంటే.?
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
సల్మాన్ పేరుతో ఈవెంట్స్ అంటూ ఫేక్ న్యూస్.. హీరో రియాక్షన్..
సల్మాన్ పేరుతో ఈవెంట్స్ అంటూ ఫేక్ న్యూస్.. హీరో రియాక్షన్..