AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: పడుకునే ముందు నీళ్లు తాగడం మంచిదేనా.? నిపుణులు ఏమంటున్నారంటే..

ఆరోగ్యానికి నీరు ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే రాత్రి పడుకునే ముందు నీరు తాగాలా.? వద్దా.? అనే విషయంలో మనలో చాలా మందికి అపోహలు ఉండడం సర్వసాధారణం. ఇంతకీ పడుకునే ముందు నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిదేనా.? ఏవైనా నష్టాలు ఉంటాయా.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: పడుకునే ముందు నీళ్లు తాగడం మంచిదేనా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Water
Narender Vaitla
|

Updated on: Oct 20, 2024 | 11:23 AM

Share

మనిషి బతకడానికి ఆహారం ఎంత ముఖ్యమో, నీరు కూడా అంతే ముఖ్యమని తెలిసిందే. శరీరంలో ఎన్నో రకాల సమస్యలను బలదూర్‌ చేయడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే కచ్చితంగా ప్రతీరోజూ కనీసం 3 లీటర్ల నీటీని తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. జీవక్రియ మెరుగ్గా ఉండాలన్నా, శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్‌ సరిగ్గా లభించాలన్నా నీటిని తీసుకోవాలి. అయితే రాత్రి పడుకునే ముందు నీళ్లు తీసుకునే విషయంలో కొన్ని అపోహలు ఉంటాయి. ఇంతకీ ఏంటా అపోహలు.? అందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..

* పడుకునే ముందు నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్య దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. నీరు తాగడం వల్ల శరీరం నుంచి వ్యర్థాలలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. రాత్రి నీరు తాగి పడుకోవడం వల్ల ఉదయం లేచే సరికి మూత్రం రూపంలో విష పదార్థాలు బయటకు వెళ్తాయి. అదే విధంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

* రాత్రి తగినంత నీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన దూరమవుతుంది. నిత్యం ఒత్తిడితో సతమతమయ్యే వారు రాత్రి పడుకునే ముందు నీరు తాగితే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

* మరీ ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరానికి సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మకాయ రసం కలుపుకొని తీసుకుంటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

నష్టాలు కూడా..

అయితే రాత్రుళ్లు పడుకునే ముందు నీరు తాగడం వల్ల లాభాలు ఎలాగైతే ఉన్నాయో.. నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి నీళ్లు తాగడం వల్ల పదేపదే మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. దీనివల్ల నిద్రకు భంగం కలిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిద్ర చక్రంలో అంతరాయం ఏర్పడడం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇలా నిద్రలేమి సమస్య దీర్ఘకాలం కొనసాగితే గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు.

నిద్రపోయే కంటే కనీసం రెండు గంటల ముందు నీటిని తాగకూడదని నిపుణులు అంటున్నారు. అయితే శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే పడుకునే ముందు ఒక గ్లాసు నీటిని తీసుకోవాలి. నీరు మాత్రమే కాకుండా అడుకునే ముందు పండ్ల రసాలను తీసుకోవడం కూడా మంచిది. అయితే రాత్రి పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్‌, కెఫీన్‌ వంటి వాటికి దూరంగా ఉండాలని అంటున్నారు

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..