Beauty: మేకప్‌ లేకుండానే ముఖం మెరిసేలా.. ఈ ఫేస్‌ ప్యాక్‌ను ట్రై చేయండి..

దానిమ్మ పండ్లు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మనం వృధ అనుకొని పడేసే దానిమ్మ తొక్కలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. దానిమ్మ తొక్కలతో చేసిన ఫేస్ ప్యాక్ ఉపయోగిస్తే.. చర్మం కాంతివంతంగా మారుతుంది...

Beauty: మేకప్‌ లేకుండానే ముఖం మెరిసేలా.. ఈ ఫేస్‌ ప్యాక్‌ను ట్రై చేయండి..
Pomegranate Peel Face Pack
Follow us

|

Updated on: Oct 20, 2024 | 10:18 AM

అందంగా, ఆకట్టుకునే విధంగా కనిపించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. అయితే మనలో మెజారిటీ మాత్రం క్రీములను ఉపయోగిస్తుంటారు. అయితే వీటివల్ల కొన్ని సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్‌ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందుకే సహజ పద్ధతుల్లో ముఖం మెరిసేలా చేసుకోవచ్చు. కొన్ని రకాల నేచురల్‌ ఫేస్‌ ప్యాక్స్‌ ద్వారా ముఖం మెరిసేలా చేసుకోవచ్చు. అలాంటి ఓ బెస్ట్ నేచురల్ ఫేస్‌ ప్యాక్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దానిమ్మ ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దానిమ్మ తొక్కలతో తయారు చేసుకునే ఫేస్‌ ప్యాక్‌ సహాయంతో ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. ఇంతకీ దానిమ్మ తొక్కలతో ఫేస ప్యాక్‌ ఎలా తయారు చేసుకోవాలి.? దీనివల్ల చర్మానికి ఎలాంటి మేలు జరుగుతుంది.? ఇప్పుడు తెలుసుకుందాం..

ఫేస్‌ ప్యాక్‌ ఎలా తయారు చేయాలంటే..

ఇందుకోసం ముందుగా దానిమ్మ తొక్కకలను తీుకొని శుభ్రంగా నీటితో కడగాలి. ఆ తర్వాత వీటిని ఎండలో రెండు రోజులు ఆరబెట్టాలి. అనంతరం ఎండిన తొక్కలను మిక్సీలో వేసి గ్రౌండ్‌ చేసుకొని పొడి చేసుకోవాలి. అనంతరం దానిమ్మ పొడిలో పెరుగు, తేనె, నిమ్మరసం కలిపి మంచి పేస్ట్‌లాగా తయారు చేసుకోవాలి. ఇక ఈ పేస్ట్‌ను ముఖాన్ని బాగా పట్టించాలి. అలా 15 నుంచి 20 నిమిషాలు వదిలెయ్యాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖం నిగనిగలాడుతుంది.

లాభాలు ఇవే..

దానిమ్మ తొక్కలతో తయారు చేసిన ఫేస ప్యాక్‌ను ఉపయోగించడం వల్ల ముఖానికి మెరుపువస్తుంది. దానిమ్మ తొక్కలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే ఇందులోని యాంటీ ఏజీంగ్‌ ఏజెంట్స్‌ ముడతలను తగ్గించి, చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. మొటిమలతో పాటు మచ్చలను తగ్గించడంలో ఈ ఫేస్‌ ప్యాక్‌ ఉపయోగపడుతుంది. చర్మానికి అవసరమైన అన్ని రకాల పోషణ అందిస్తుంది. దానిమ్మ తొక్క చర్మం రంగును మెరుగుపరచడంలో కూడా తోడ్పడుతుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..