అల్యూమినియం పాత్రలు వాడితే .. జర భద్రం !

పూర్వకాలంలో వంట కోసం మట్టిపాత్రలనే వినియోగించేవారు. కానీ ఇప్పుడు స్టీల్, ఇత్తడి, కాపర్, అల్యూమినియం, నాన్ స్టిక్ వేర్ లాంటి రకరకాల వంట పాత్రలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, వీటన్నిటిలో ఎక్కువ శాతం మంది వంటగదుల్లో కనిపించేవి అల్యూమినియం పాత్రలే. అన్నం, కూర, చారు చివరికి టీ కాయడానికి కూడా మన వంట గదుల్లో అల్యూమినియం వస్తువులనే వినియోగిస్తుంటాం. మరి ఈ పాత్రలు ఎంతవరకూ సేఫ్ అనే ప్రశ్న ఇప్పుడు చర్చకు వచ్చింది. వంట చేసేటప్పుడు తప్పనిసరిగా […]

అల్యూమినియం పాత్రలు వాడితే .. జర భద్రం !
Follow us

|

Updated on: Nov 18, 2019 | 5:43 PM

పూర్వకాలంలో వంట కోసం మట్టిపాత్రలనే వినియోగించేవారు. కానీ ఇప్పుడు స్టీల్, ఇత్తడి, కాపర్, అల్యూమినియం, నాన్ స్టిక్ వేర్ లాంటి రకరకాల వంట పాత్రలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, వీటన్నిటిలో ఎక్కువ శాతం మంది వంటగదుల్లో కనిపించేవి అల్యూమినియం పాత్రలే. అన్నం, కూర, చారు చివరికి టీ కాయడానికి కూడా మన వంట గదుల్లో అల్యూమినియం వస్తువులనే వినియోగిస్తుంటాం. మరి ఈ పాత్రలు ఎంతవరకూ సేఫ్ అనే ప్రశ్న ఇప్పుడు చర్చకు వచ్చింది. వంట చేసేటప్పుడు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవల్సిన విషయం ఒకటుంది. టమాటాల లాంటి యాసిడ్స్‌ కలిగిన పదార్థాలు, అలాగే పుల్లని పదార్థాలు వండటం కోసం అల్యుమినియం పాత్రలను వాడినపుడు వీటినుంచి ఎక్కువ శాతం అల్యూమినియం పదార్థాలలో కలిసే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం వల్ల బ్రెయిన్ సెల్స్ డామేజ్ అయ్యే అవకాశం ఉందని వైద్య పరిశోధనల్లో రుజువైంది. వీటిని ఎక్కువకాలం వాడితే, షుగర్, కీళ్ళ నొప్పులు, లివర్ వ్యాధులు, కిడ్ని సమస్యలు, గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పరిశోధనలు తేల్చాయి. మరి ఈ వస్తువులను అలా వాడకుండా వదిలేయాలా అంటే? దానికీ ఓ మార్గముంది. అల్యూమినియం పాత్రలు వాడాల్సి వచ్చినప్పుడు వాటిలో ఎక్కువసేపు పుల్లటి, లేదా యాసిడ్ కలిగిన పదార్ధాలను నిల్వ ఉంచకూడదు, అలాగే ఈ పాత్రల్లో ఫ్రై లాంటి వంటలు కూడా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్యూర్ అల్యూమినియం కాకుండా ఎనోడైజ్డ్ అల్యూమినియం మెటల్‌తో తయారు చేసిన పాత్రలు వాడితే అది వంటల్లో కలిసే ప్రమాదం అంతగా ఉండదని పరిశోధకులు చెప్తున్నారు.