AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Immunity for Children: పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచాలా.. ఇవి బెస్ట్!

పిల్లల్లో రోగ నిరోధక శక్తి అనేది చాలా అవసరం. వీరిలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటేనే ఆరోగ్యంగా, యాక్టీవ్‌గా ఉంటారు. లేదంటే జబ్బుల బారిన పడుతూ ఉంటారు. కొంత మంది పిల్లలు తరచూ జబ్బుల బారిన పడుతూ ఉంటే వారిలో రోగ నిరోధక శక్తి అనేది సరిగ్గా లేదని తల్లిదండ్రులు గమనించాలి. చిన్న వయసులోనే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. పిల్లల్లో చిన్పప్పుడు సరైన విధంగా ఇమ్యూనిటీ లేకపోతే.. భవిష్యత్తులో నీరసంగా, నిరాశగా కనిస్తారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా..

Immunity for Children: పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచాలా.. ఇవి బెస్ట్!
Children
Chinni Enni
|

Updated on: Feb 04, 2024 | 3:00 PM

Share

పిల్లల్లో రోగ నిరోధక శక్తి అనేది చాలా అవసరం. వీరిలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటేనే ఆరోగ్యంగా, యాక్టీవ్‌గా ఉంటారు. లేదంటే జబ్బుల బారిన పడుతూ ఉంటారు. కొంత మంది పిల్లలు తరచూ జబ్బుల బారిన పడుతూ ఉంటే వారిలో రోగ నిరోధక శక్తి అనేది సరిగ్గా లేదని తల్లిదండ్రులు గమనించాలి. చిన్న వయసులోనే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. పిల్లల్లో చిన్పప్పుడు సరైన విధంగా ఇమ్యూనిటీ లేకపోతే.. భవిష్యత్తులో నీరసంగా, నిరాశగా కనిస్తారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా త్వరగా తగ్గవు. పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచాలంటే చాలా రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి దాదాపు అందరి ఇళ్లల్లోనే ఉంటాయి. వీటిని పిల్లలకు ఏదో రూపంలో ఇవ్వడానికి ట్రై చేయండి.

తులసి ఆకులు:

తులసి మొక్క దాదాపు అందరి ఇళ్లలో కూడా కనిపిస్తుంది. తులసిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా పలు అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్లు, ఎసెన్షియల్ ఆయిల్స్, ఫైటో న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి పిల్లల్లో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసి.. బ్యాక్టీరియా, ఇన్ ఫెక్షన్లు వంటి వాటితో పోరాటం చేస్తాయి. తులసి ప్రయోజనాలు పిల్లలకు అందాలంటే.. ప్రతి రోజూ వేడి నీటిలో రెండు తులసి ఆకులు వేసి పిల్లలకు ఇవ్వండి.

జామ పండు:

పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచడంలో జామ పండు చాలా ఉపయోగ పడుతుంది. ఇందులో యాంటీ వైరల్ గుణాలతో పాటు పలు పోషకాలు కూడా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి.. వ్యాధి కారక క్రిములతో పోరాడుతుంది. పిల్లలకు జామ పండ్లను తినిపిస్తూ ఉండండి. అప్పుడే వారు ఆరోగ్యంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

అల్లం:

అల్లం కూడా అందరి ఇళ్లలో ఉంటుంది. పిల్లల్లో అప్పుడప్పుడు ఆకస్మికంగా జ్వరం, జలుబు, దగ్గు, తల నొప్పి, కీళ్ల నొప్పులు వంటివి వస్తూ ఉంటాయి. పిల్లలకు అల్లాన్ని ఇవ్వడం వల్ల అనారోగ్యం రాకుండా చేస్తుంది. ఇందులో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అప్పుడప్పుడు అల్లం మరిగించిన నీటిని పిల్లలకు ఇస్తూ ఉండండి.

జాజికాయ:

జాజికాయలో రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యం ఉంది. వాతావరణ పరిస్థితులు మారినప్పుడు చిటికెడు జాజికాయ పొడిని పాలల్లో కలిపి పిల్లలకు ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలకు మంచి నిద్ర పడుతుంది. దగ్గు, జలుబు వంటి వాటికి చికిత్స అందుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us