Kitchen Hacks: ఈ టిప్స్ ఫాలో అయితే.. రెస్టారెంట్ స్టైల్ లో కర్రీ వస్తుంది!

చాలా మంది రెస్టారెంట్, హోటల్స్ కు వెళ్లి తినే ఉంటారు. అక్కడ ఉండే ఫుడ్ ఐటెమ్స్ టెక్చర్, కలర్, సువాసనే వేరు. అందుకే ఎప్పుడు ఖాళీ అయినా, వీకెండ్స్ అయినా, స్పెషల్ డేస్ అయినా.. రెస్టారెంట్ అండ్ హోటల్స్ కు క్యూ కడతారు జనం. ముఖ్యంగా రెస్టారెంట్ స్టైల్ కర్రీస్ అంటే చాలా మందికి ఇష్టం. అలా ఇంట్లో చేద్దాం అంటే అస్సలు రాదు. ఏమైనా స్పెషల్ డేస్, వీకెండ్స్ లేదా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు..

Kitchen Hacks: ఈ టిప్స్ ఫాలో అయితే.. రెస్టారెంట్ స్టైల్ లో కర్రీ వస్తుంది!
Kitchen Hacks

Edited By:

Updated on: Dec 17, 2023 | 4:20 PM

చాలా మంది రెస్టారెంట్, హోటల్స్ కు వెళ్లి తినే ఉంటారు. అక్కడ ఉండే ఫుడ్ ఐటెమ్స్ టెక్చర్, కలర్, సువాసనే వేరు. అందుకే ఎప్పుడు ఖాళీ అయినా, వీకెండ్స్ అయినా, స్పెషల్ డేస్ అయినా.. రెస్టారెంట్ అండ్ హోటల్స్ కు క్యూ కడతారు జనం. ముఖ్యంగా రెస్టారెంట్ స్టైల్ కర్రీస్ అంటే చాలా మందికి ఇష్టం. అలా ఇంట్లో చేద్దాం అంటే అస్సలు రాదు. ఏమైనా స్పెషల్ డేస్, వీకెండ్స్ లేదా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు వంట బాగా రావాలి అనుకుంటారు. రెస్టారెంట్ స్టైల్ లో చిక్కటి గ్రీవీ కోసం ట్రై చేస్తూ ఉంటారు లేడీస్. ఇలా రెస్టారెంట్ అండ్ హోటల్స్ స్టైల్ ల్లో కర్రీస్ రావాలంటే.. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు. మరి ఆ టిప్స్ ఏంటి? ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు:

కూరల్లో మంచి చిక్కని, చక్కటి గ్రేవీ రావాలంటే.. పెరుగు, ఫ్రెష్ క్రీమ్ బాగా సహాయ పడతాయి. పెరుగు వేయగానే కర్రీ టెక్చర్ గానీ, కలర్ గానీ మారి పోతుంది. అంతే కాకుండా కర్రీ ఎంతో రుచిగా వస్తుంది. పెరుగును ఒక బౌల్ లోకి తీసుకుని బాగా చిలికి.. కర్రీ దించే ముందు వేసి.. బాగా కలుపుకుని సిమ్ లో పెట్టుకుంటే.. పెరుగు విరిగిపోకుండా ఉంటుంది.

జీడిపప్పు:

జీడి పప్పు పేస్ట్ తో కూడా కర్రీ టెక్చర్, రుచి, కలరే మారి పోతుంది. పన్నీర్, కాజు మసాలా, చికెన్, మటన్, ఫిష్, వెజిటేబుల్స్ కర్రీస్ ఏదైనా.. జీడి పప్పు పేస్ట్ వేసుకుంటే కర్రీనే మారి పోతుంది. జీడిపప్పును ముందు వేయించుకుని.. చల్లారాక మెత్తని పేస్ట్ లా చేసుకుని కూర ఉడికేటప్పుడు వేసుకుని తింటే అద్భుతం అంతే. జీడి పప్పు పేస్ట్ తో చేసే కర్రీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జీడి పప్పుకు బదులు.. నువ్వులు, బాదం, గుమ్మడి విత్తనాలు, పల్లీలు కూడా ఉపయోగించ వచ్చు.

ఇవి కూడా చదవండి

శనగ పిండి:

కూర చిక్కగా.. మంచి గ్రేవీ రావాలంటే శనగ పిండి సహాయ పడుతుంది. పులుసులు వంటి కర్రీస్ లో శనగ పిండిని ఉపయోగిస్తే.. చిక్కగా మారడమే కాకుండా.. రుచిగా కూడా ఉంటుంది. కర్రీ రుచిని పెంచుతుంది శనగ పిండి. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..