Butter Milk Rice: మజ్జిగ అన్నం తింటే ఇన్ని సమస్యలు దూరమవుతాయా..

పెరుగు అన్నం అంటే చాలా మందికి ఇష్టం. ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చిన్న పిల్లలే కాదు.. పెద్ద వాళ్లు కూడా చాలా ఇష్టంగా పెరుగు అన్నం తింటూ ఉంటారు. పెరుగు అన్నం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అయితే పెరుగు అన్నం కంటే మజ్జిగ అన్నం తినడమే ఆరోగ్యానికి మరింత మంచిదట. మజ్జిగ శరీరాన్ని చల్లబరుస్తుంది. డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది. కండరాలు ఆరోగ్యంగా, బలంగా, దృఢంగా ఉండేందుకు..

Butter Milk Rice: మజ్జిగ అన్నం తింటే ఇన్ని సమస్యలు దూరమవుతాయా..
Buttermilk Rice
Follow us
Chinni Enni

|

Updated on: Sep 13, 2024 | 2:02 PM

పెరుగు అన్నం అంటే చాలా మందికి ఇష్టం. ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చిన్న పిల్లలే కాదు.. పెద్ద వాళ్లు కూడా చాలా ఇష్టంగా పెరుగు అన్నం తింటూ ఉంటారు. పెరుగు అన్నం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అయితే పెరుగు అన్నం కంటే మజ్జిగ అన్నం తినడమే ఆరోగ్యానికి మరింత మంచిదట. మజ్జిగ శరీరాన్ని చల్లబరుస్తుంది. డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది. కండరాలు ఆరోగ్యంగా, బలంగా, దృఢంగా ఉండేందుకు మజ్జిగ చాలా మంచిది. ఇందులో క్యాల్షియం కూడా మెండుగా లభిస్తుంది. దీని వలన దంతాలు, ఎముకలు బలంగా ఉంటాయి. మజ్జిగ అన్నంలో విటమిన్ బి12, ల్యాక్టిక్ యాసిడ్ లభిస్తాయి. ఇవి పొట్ట సమస్యలు రాకుండా చేస్తాయి. ఇతర లాభాలు కూడా చాలా ఉన్నాయి. మరి పెరుగు అన్నం తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

చర్మ ఆరోగ్యానికి మంచిది:

మజ్జిగ అన్నం తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మ కణాలను పునరుత్పత్తి చేసేందుకు సహాయ పడుతుంది. దీని కారణంగా చర్మం కాంతివంతంగా ఉంటుంది. ముడతలు తగ్గి.. యవ్వనంగా ఉంటారు. మజ్జిగ తాగితే చర్మం మృదువుగా మారుతుంది. మజ్జిగ అన్నంత తింటే ముఖం మెరుస్తూ ఉంటుంది.

ఎముకలు బలంగా:

మజ్జిగ అన్నం తినడం వల్ల ఎముకలు గట్టి పడతాయి. ఎముకలు బలహీనంగా ఉండి బాధ పడుతున్నవారు మజ్జిగ అన్నం తింటే చాలా మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ప్రతి రోజూ మజ్జిగ అన్నం పెట్టడం వల్ల వారు ఎదుగుదల సవ్యంగా ఉంటుంది. ఎముకలు బలంగా మారతాయి. దంతాలు కూడా దృఢంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

కండరాలు ఆరోగ్యం:

పిల్లలు, పెద్దలు ప్రతి రోజూ మజ్జిగ అన్నం తింటే కండరాలు కూడా బలంగా మారతాయి. కండరాలు బలంగా ఉంటే.. ఎలాంటి నొప్పులు రాకుండా ఉంటాయి.

గుండె ఆరోగ్యం:

మజ్జిగ అన్నం తినడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా పని చేస్తుంది. మజ్జిగలో ఉండే పొటాషియం.. రక్త పోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. తల నొప్పి కూడా తగ్గుతుంది.

శరీరానికి చల్లదనం ఇస్తుంది:

మజ్జిగ అన్నం తినడం వల్ల శరీరానికి చల్లదనం కలుగుతుంది. ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మజ్జిగ అన్నం తినడం చాలా మంచిది. ఇది బాడీ కూల్ చేయడంతో పాటు బాడీ డీహైడ్రేషన్‌కి గురి కాకుండా చేస్తుంది.

పొట్ట ఆరోగ్యం:

మజ్జిగ అన్నం తినడం వల్ల జీర్ణ క్రియ అనేది బాగా మెరుగు పడుతుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు పరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే పేగుల ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేసి.. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..