గిన్నెలు కడగడానికి మార్కెట్‌లో అనేక రకాల సబ్బులు అందుబాటులో ఉన్నాయి. అలాగే రకరకాల లిక్విడ్‌లు కూడా మార్కెట్లో ఉన్నాయి. వీటితో వంట గదిలోని సామాన్లు, గిన్నెలు, గాజులు, పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగింస్తుంటాం. ప్లాస్టిక్, పింగాణీ వంటి వాటిని కూడా కడగొచ్చు. అయితే కొందరు వీటితో ఇతర వస్తువులను కూడా శుభ్రం చేస్తుంటారు. వీటిపై మురికి, జిడ్డు, మరకలు మొదలైన వాటిని తొలగించడానికి డిష్ సోప్ ఉపయోగించడం అంత మంచిది కాదు. చెక్క ఫర్నీచర్, షో పీస్‌లు వంటి వాటిని డిష్ సోప్‌తో శుభ్రం చేయకూడదు. ఇలా చేస్తే చెక్క పాలిష్ త్వరగా పాడై పోతుంది. చెక్కను శుభ్రం చేయడానికి వివిధ లిక్విడ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించవచ్చు. చెక్కతో చేసిన ఫర్నీచర్ ను ప్రతిరోజూ పొడి గుడ్డతో తుడిచేస్తే మురికి పట్టదు.