Beans Uses: బీన్స్ తిన్నారంటే.. ఈ సమస్యలకు అసలు ట్యాబ్లెట్స్ వాడాల్సిన పనిలేదు!
కూరగాయల్లో బీన్స్ కూడా ఒకటి. బీన్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. బీన్స్‌లో రెండు, మూడు రకాలు ఉంటాయి. వాటిల్లో గ్రీన్ బీన్స్ ఒకటి. బీన్స్‌తో చాలా రకాల ఆహారాలు తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. బీన్స్‌లో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు దరి చేరకుండా..

కూరగాయల్లో బీన్స్ కూడా ఒకటి. బీన్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. బీన్స్‌లో రెండు, మూడు రకాలు ఉంటాయి. వాటిల్లో గ్రీన్ బీన్స్ ఒకటి. బీన్స్‌తో చాలా రకాల ఆహారాలు తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. బీన్స్‌లో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. బీన్స్‌లో ఫోలేట్, విటమిన్లు ఎ, సి, కె, ఫైబర్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఉంటాయి. నాన్ వెజ్ తినకుండా.. కేవలం వెజిటేరియన్ తినేవారికి ఈ ఆహారాలు ఎంతో మంచివి. బీన్స్‌లో ఉండే ప్లాంట్ బెస్ట్ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి బీన్స్ మీ డైట్‌లో తప్పకుండా యాడ్ చేసుకోండి. వీటిని తినడం వల్ల చాలా రకాల సమస్యలకు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మరి బీన్స్ తినడం వల్ల ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాన్సర్:
బీన్స్ తినడం వల్ల క్యాన్సర్ సమస్యను తగ్గించుకోవచ్చు. గ్రీన్ బీన్స్‌లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యకు మంచి నివారణ అని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రేగు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ప్రేగుల్లో వచ్చే క్యాన్సర్ నివారణకు బీన్స్ హెల్ప్ చేస్తాయి.
ఎముకలు ఆరోగ్యం:
బీన్స్‌లో క్యాల్షియం, విటమిన్ కె కూడా ఉంటుంది. ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి. బీన్స్ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. భవిష్యత్తులో వచ్చే ఎముకల సమస్యలు రావు. ఎముకలు బలహీనంగా ఉండేవారు బీన్స్ తింటే మంచి ఫలితం ఉంటుంది.
జీర్ణ క్రియ మెరుగు పడుతుంది:
బీన్స్‌లో కరికే, కరగని ఫైబర్స్ ఉంటాయి. ఇవి రెండూ కూడా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో సహాయ పడతాయి. మల బద్ధకం, అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడకుండా చూస్తుంది. అంతే కాకుండా డైజెస్టివ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బరువు తగ్గుతారు:
బీన్స్ తినడం వల్ల కూడా బరువు తగ్గుతారు. వెయిట్ లాస్ అయ్యేవారు కుక్ చేసిన బీన్స్‌ని మీ డైట్‌లో చేర్చుకోండి. అంతే కాకుండా వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. దీంతో బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








