AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yellow Teeth Home Remedies: పళ్ళు పసుపు రంగులోకి మారాయా..? ఈ టిప్స్ పాటిస్తే మిలమిల మెరవడం ఖాయం..

ఎవరైనా తెలిసినవారు కనపడగానే ముందుగా వారిని నవ్వుతూ పలకరిస్తాం. మన చిరునవ్వే ఎదుటి వ్యక్తులు మనలో గమనించే మొదటి అంశం.

Yellow Teeth Home Remedies: పళ్ళు పసుపు రంగులోకి మారాయా..? ఈ టిప్స్ పాటిస్తే మిలమిల మెరవడం ఖాయం..
Yellow Teeth Causes
Ram Naramaneni
|

Updated on: Jul 22, 2021 | 7:20 PM

Share

ఎవరైనా తెలిసినవారు కనపడగానే ముందుగా వారిని నవ్వుతూ పలకరిస్తాం. మన చిరునవ్వే ఎదుటి వ్యక్తులు మనలో గమనించే మొదటి అంశం. అయితే చాలామంది పసుపు దంతాలతో బాధపడుతుంటారు. దీంతో నవ్వు వచ్చినా కూడా చేయి అడ్డుపెట్టుకుని నవ్వుతూ ఉంటారు. పసుపు దంతాల సమస్య కొత్తది కాదు. చాలామంది ప్రజలు ఈ సమస్యతో పోరాడుతుంటారు. అయితే ఈ సమస్య కొన్నిసార్లు ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది. అసలు దంతాలు ఎందుకు పసుపు రంగులోకి మారుతాయి..? వాటిని ఎలా తెల్లగా ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం….

మీ దంతాలు ఎందుకు పసుపు రంగులోకి మారుతాయి?

  • అధిక ధూమపానం, మద్యపానం వంటి అనారోగ్య జీవనశైలి.
  • ఎక్కువ కార్బోహైడ్రోట్ కంటెంట్ ఉన్న ఆహారం తీసుకోవడం.
  • అనేక ఆహార పదార్థాలు దంతాలపై మరకలు కలిగిస్తాయి. వాటిలో కాఫీ, టీ, వైన్లు ఉన్నాయి
  • పొగాకు వాడకం – ధూమపానం లేదా పొగాకు నమలడం వంటివి కూడా దంతాలను పసుపు రంగులోకి మారుస్తాయి
  •  అపరిశుభ్రమైన నీటిని ఉపయోగించడం కూడా ఒక కారణం కావచ్చు.
  •  దంత పరిశుభ్రత పాటించకపోవడం, కొన్ని ఆరోగ్య పరిస్థితులు లేదా వ్యాధులు, కొన్ని మందులు కూడా కారణమని చెప్పవచ్చు.
  •  వృద్ధాప్యం లేదా జన్యువుల కారణంగా కూడా దంతాలు పసుపు రంగులోకి మారొచ్చు
  • మీ వైద్యుడు వాటిని ఆమోదిస్తే మీరు పరిగణించదగిన హోం రెమెడీస్ కొన్ని ఉన్నాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్

పబ్మెడ్ సెంట్రల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఆపిల్ సైడర్ వెనిగర్ దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది. అయితే దీనిని చాలా తక్కువ పరిమాణంలో ఉపయోగించాలి.

రోజుకు రెండుసార్లు బ్రష్ చెయ్యాలి

ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయడానికి ప్రయత్నించండి. 2 నుండి 3 నిమిషాలు మాత్రమే బ్రష్ చేయడానికి కేటాయించండి. ఇలా చెయ్యడం వలన మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. నోరు, నాలుక కూడా ఎక్కవ శుభ్రంగా ఉంటాయి.

ఆరోగ్యకరమైన ఆహారం 

మీరు విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం… పండ్లు, కూరగాయలు తినాలి. ఇవి మీ దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడతాయి. బెర్రీలు, బీట్‌రూట్‌లను తక్కువగా తినండి ఎందుకంటే అవి దంతాల రంగును ప్రభావితం చేస్తాయి.

యాక్టివేటెడ్ చార్‌కోల్

చాలా కంపెనీలు టూత్‌పేస్ట్‌లో యాక్టివేటెడ్ చార్‌కోల్‌ను వినియోగిస్తాయి. అది మీ దంతాలు తెల్లగా అవ్వడానికి సాయపడుతుంది. యాక్టివేటెడ్ చార్‌కోల్ క్యాప్సూల్స్‌‌ రూపంలో కూడా లభ్యమవుతాయి. ఈ క్యాప్యూల్స్‌ను దంతాలపై రుద్ది అనంతరం నీటితో కడగాలి.

హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా 

హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా.. ఈ  రెండూ మీ దంతాలను తెల్లగా ఉంచడానికి, గారను తొలగించడానికి సాయపడతాయి.  మీరు 2 టీస్పూన్లు హైడ్రోజన్ పెరాక్సైడ్, 1 టీస్పూన్ బేకింగ్ సోడాను మిక్స్ చేసి పేస్ట్ మాదిరిగా వినియోగించవచ్చు

పాలు

కాల్షియం పాలలో అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది మీ దంతాలపై ఏర్పడిన పసుపు మరకలను తొలగిస్తుంది. పాలలో ఉండే ప్రోటీన్ మీ ఆరోగ్యాన్ని కూడా చక్కగా ఉంచుతుంది.

నిమ్మకాయ

నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మీ దంతాలపై ఏర్పడిన పసుపు గారను తొలగిస్తుంది. నోరు దర్వాసన రాకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది. నిమ్మరసంతో కలిపిన నీటిని ఎక్కువ మొత్తంలో ఉపయోగించడం వల్ల మీ దంతాల పసుపు రంగు తొలగిపోతుంది.

Also Read: తాగిన మైకంలో పొంగిపొర్లుతున్న వాగు మధ్యలో డ్యాన్స్… చివరికి ఏం జరిగిందో మీరే చూడండి

కర్నూలు జిల్లాలో పాల వ్యాను బోల్తా.. జనాలు చూడండి ఎలా ఎగబడి వచ్చారో