AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glycolic Acid For Underarms: వ్యాక్స్‌ వల్ల ఆ భాగాల్లో నల్లటి మచ్చలా? గ్లైకోలిక్ యాసిడ్‌తో సులువుగా తొలగించుకోండి.. ఎలా వాడాలంటే

తరచూ వ్యాక్స్‌ చేసుకోవడం వల్ల చంక భాగాల్లో నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ మచ్చలు తొలగిపోవు. పుల్లని పెరుగు నుంచి కాఫీ వరకు ఎన్ని టిప్స్‌ ఫాలో అయినా వీటిని అంత సులువగా తొలగించడం కుదరదు. దీంతో స్లీవ్‌లెస్ దుస్తులను ధరిచండం ఇబ్బందికరంగా ఉంటుంది. పార్లర్ రెమెడీస్‌, ఇంటి నివారణ ఫలితాలు విఫలమైన సందర్భాల్లో యాసిడ్‌ని ఉపయోగించవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు..

Glycolic Acid For Underarms: వ్యాక్స్‌ వల్ల ఆ భాగాల్లో నల్లటి మచ్చలా? గ్లైకోలిక్ యాసిడ్‌తో సులువుగా తొలగించుకోండి.. ఎలా వాడాలంటే
Glycolic Acid For Underarms
Srilakshmi C
|

Updated on: Mar 05, 2024 | 9:24 PM

Share

తరచూ వ్యాక్స్‌ చేసుకోవడం వల్ల చంక భాగాల్లో నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ మచ్చలు తొలగిపోవు. పుల్లని పెరుగు నుంచి కాఫీ వరకు ఎన్ని టిప్స్‌ ఫాలో అయినా వీటిని అంత సులువగా తొలగించడం కుదరదు. దీంతో స్లీవ్‌లెస్ దుస్తులను ధరిచండం ఇబ్బందికరంగా ఉంటుంది. పార్లర్ రెమెడీస్‌, ఇంటి నివారణ ఫలితాలు విఫలమైన సందర్భాల్లో యాసిడ్‌ని ఉపయోగించవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. యాసిడ్‌ ఎలా తొలగిస్తుంది? అని ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ రోజుల్లో యాసిడ్‌లు ఎక్కువగా సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తున్నారు. అలాంటి వాటిల్లో గ్లైకోలిక్ యాసిడ్ ఒకటి. ఇది చంకల క్రింద నల్ల మచ్చలను తొలగించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. గ్లైకోలిక్ యాసిడ్ అనేది ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్ రకం. ఇది చెరకు రసంతో తయారవుతుంది. ఇది సహాజ సిద్ధంగా తయారు చేయడం వల్ల చాలా తేలికపాటి రసాయనాలు మాత్రమే ఉంటాయి. అంటే గ్లైకోలిక్ యాసిడ్ చర్మానికి పూసినప్పుడు చర్మంలోకి చొచ్చుకుపోతుంది. ప్రాథమికంగా గ్లైకోలిక్ యాసిడ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. డార్క్ అండర్ ఆర్మ్స్ క్లియర్ చేస్తుంది. అలాగే చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. గ్లైకోలిక్ యాసిడ్ కొత్త కణాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

అండర్ ఆర్మ్ డార్క్ ప్యాచ్‌లను హైపర్‌పిగ్మెంటేషన్ అని కూడా అంటారు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి గ్లైకోలిక్ యాసిడ్ ఉపయోగించాలి. మార్కెట్‌లో గ్లైకోలిక్ యాసిడ్‌తో కూడిన క్రీమ్‌లు, టోనర్లు, మాయిశ్చరైజర్లు ఉంటాయి. వీటిని నేరుగా చంకలకు అప్లై చేసుకోవచ్చు. గ్లైకోలిక్ యాసిడ్ కలిగిన సీరమ్‌లను కూడా ఉపయోగించవచ్చు.

గ్లైకోలిక్ యాసిడ్ సీరమ్‌ను నేరుగా చంకలపై పూతలా పూయవచ్చు. దీన్ని రెగ్యులర్ గా అప్లై చేస్తే చంకల్లోని నల్లటి మచ్చలు క్రమంగా తొలగిపోతాయి. వరుసగా కొన్ని రోజులు గ్లైకోలిక్ యాసిడ్ ఉపయోగించిన తర్వాత స్క్రబ్బింగ్ చేయడం ఉత్తమం. ఇది నల్ల మచ్చలను తొలగిస్తుంది. గ్లైకోలిక్ యాసిడ్ అండర్ ఆర్మ్ డియోడరెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇది చెమట బ్యాక్టీరియాను విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి చెమట దుర్వాసన ఉండదు. గ్లైకోలిక్ యాసిడ్‌ కలిగిన రోల్-ఆన్‌ను కూడా ఉపయోగించవచ్చు. గ్లైకోలిక్ యాసిడ్‌ను సున్నితమైన చర్మంపై ఉపయోగించకూడదు. దీనిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై చికాకు కలుగుతుంది. అలాగే, స్క్రబ్బింగ్, వ్యాక్సింగ్ తర్వాత చంకలకు గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న సౌందర్య ఉత్పత్తులు వినియోగించకూడదు. ఇది మంటను మరింత పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ సంబంధిత కథనాల కోసం క్లిసం క్లిక్‌ చేయండి.