Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీ ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ వచ్చినట్లే.. ఏంటో తెలుసుకోండి..!

Lung Infection : కరోనా వైరస్ వల్ల దేశం మొత్తం అతలాకుతలమవుతుంది.. ప్రతి ఒక దగ్గర కరోనా ప్రమాదం పొంచి ఉంది. ఇటువంటి

మీకు ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీ ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ వచ్చినట్లే.. ఏంటో తెలుసుకోండి..!
Covid-19 Lungs Damage
Follow us
uppula Raju

|

Updated on: Apr 30, 2021 | 5:33 PM

Lung Infection : కరోనా వైరస్ వల్ల దేశం మొత్తం అతలాకుతలమవుతుంది.. ప్రతి ఒక దగ్గర కరోనా ప్రమాదం పొంచి ఉంది. ఇటువంటి సందర్భంలో మనల్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలి అలాగే ఒకవేళ కరోనా వచ్చినా ఎలా తట్టుకోవాలో ముందస్తుగా శరీరాన్ని సిద్దం చేయాలి.. ముఖ్యంగా కరోనా వైరస్ శరీరంలో శ్వాస వ్యవస్థపై బలంగా దెబ్బ తీస్తుంది. దీంతో మనిషికి ఉన్నపలంగా ఆక్సిజన్ అవసరమవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ముందస్తుగా మన శరీరంలోని ఊపిరితిత్తులను బలంగా చేసుకోవాలి..

క‌రోనా వైర‌స్ ప్రధాన టార్గెట్ ఊపిరితిత్తులే.. ఎందుకంటే కొవిడ్‌-19 సోకిన వారిలో చాలామంది శ్వాస ఆడ‌క‌నే ఇబ్బంది ప‌డుతున్నారు. నిజానికి వైర‌స్ చాలావ‌ర‌కు మ‌న గొంతు ద్వారానే శ‌రీరంలోకి ప్రవేశిస్తుంది. శ్వాస‌మార్గం గుండా నేరుగా లంగ్స్‌కు చేరుతుంది. కనుక ముందుగా వాటిపైనే ప్రభావం చూపిస్తుంది. దీనివ‌ల్ల శ్వాస‌మార్గంలో ఇన్‌ఫెక్షన్ ఏర్పడి శ్వాస తీసుకోవ‌డం క‌ష్టమ‌వుతుంది. మీ ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ వచ్చిందని ఎలా తెలుస్తుందంటే..

గొంతు నొప్పి, పొడి ద‌గ్గు వస్తోంది. క‌రోనా సోకిన వారిలో దాదాపు 80 శాతం మందిలో ఇలాంటి ల‌క్షణాలే క‌నిపిస్తాయి. కొంత‌మందిలో న్యుమోనియా ల‌క్షణాలు కూడా క‌నిపిస్తాయి. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉందంటే.. మీ ఊపిరితిత్తుల్లోకి వైర‌స్ ప్రవేశించింద‌ని అనుమానించాల్సిందే. ఊపిరితిత్తుల దిగువ భాగంలో వాపు లేదా నొప్పి ఎక్కువ‌గా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పొడి దగ్గు ద‌గ్గుతున్నప్పుడు నొప్పి రావడం కూడా కొవిడ్‌-19కి సంకేతం. క‌రోనావైర‌స్ ల‌క్షణాలు బ‌య‌ట‌ప‌డేస‌రికే 25 శాతం వ‌ర‌కు లంగ్స్ దెబ్బతింటాయి. కొన్ని సంద‌ర్భాల్లో లంగ్స్ మొత్తం పాడైపోయి ప్రాణానికే ప్రమాదం ఏర్పడ‌వ‌చ్చు.

ఊపిరితిత్తుల ప‌నితీరు బాగుంటేనే శ‌రీరానికి కావాల్సిన ఆక్సిజ‌న్ స‌క్ర‌మంగా అందుతుంది. కనుక ప్రతిరోజు వ్యాయామం చేయడం తప్పనిసరి. శారీర‌క శ్రమ వ‌ల్ల శ్వాస తీసుకునే సామ‌ర్థ్యం పెరుగుతుంది. త‌ద్వారా ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు పెరుగుతాయి. ఫ‌లితంగా ఊపిరితిత్తులు ఆక్సిజ‌న్‌ను గ్రహించే సామ‌ర్థ్యం పెరుగుతుంది. కాబ‌ట్టి ప్రతిరోజు రన్నింగ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయ‌డం మంచిది. సీజనల్ ప్రూట్స్, తాజా కూరగాయాలు నిత్యం తీసుకుంటూ ఉండాలి.

కోవిడ్ పై తప్పుడు ప్రచారం చేస్తే కోర్టు ధిక్కారమే, సుప్రీంకోర్టు వార్నింగ్, సమాచారం సరైనదైతే ఆంక్షలుండవని వెల్లడి

Super Women: తొడ‌ల మ‌ధ్య‌లో మూడు పుచ్చకాయ‌ల‌ను తుక్కు తుక్కు చేసింది.. వ‌రల్డ్ రికార్డ్ నెల‌కొల్పింది