Super Women: తొడ‌ల మ‌ధ్య‌లో మూడు పుచ్చకాయ‌ల‌ను తుక్కు తుక్కు చేసింది… వ‌రల్డ్ రికార్డ్ నెల‌కొల్పింది

ఈ ప్ర‌పంచంలో కొంద‌రు వ్యక్తులు రికార్డులు, రివార్డుల కోసం ఏం చెయ్య‌డానికైనా వెన‌కాడ‌రు. జీవితం మొత్తం రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డానికే వెచ్చించేవారు కూడా ఉంటారు.

Super Women: తొడ‌ల మ‌ధ్య‌లో మూడు పుచ్చకాయ‌ల‌ను తుక్కు తుక్కు చేసింది... వ‌రల్డ్ రికార్డ్ నెల‌కొల్పింది
Super Women
Follow us

|

Updated on: Apr 30, 2021 | 6:30 PM

ఈ ప్ర‌పంచంలో కొంద‌రు వ్యక్తులు రికార్డులు, రివార్డుల కోసం ఏం చెయ్య‌డానికైనా వెన‌కాడ‌రు. జీవితం మొత్తం రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డానికే వెచ్చించేవారు కూడా ఉంటారు. తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన ఒక మహిళ తన తొడల మధ్య 3 పుచ్చకాయలను వేగంగా నలిపివేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉక్రెయిన్‌కు చెందిన ఓల్గా లియాష్‌చుక్ తన తొడల మధ్య 3 పుచ్చకాయలను 14.65 సెకన్లలో మ‌టాష్ చేసింది. అందుకు సంబంధించిన‌ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసింది. ప్రపంచంలోని బలమైన మహిళ కావాలన్నది ఓల్గా కోరిక అట‌. దీని కోసం ఆమె నిరంతరం కష్టపడుతోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో, ఓల్గా తన తొడలతో పెద్ద పుచ్చకాయలను ఎలా తుక్కు తుక్కు చేసిందో మీరు చూడవచ్చు.

ఈ రికార్డును విజయవంతంగా నెల‌కొల్పిన‌ ఓల్గా మాట్లాడుతూ… ‘ఇది చాలా సులభం అని చాలామంది భావిస్తారు. కానీ ఇది చాలా కష్టం’ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పోస్ట్ చేసిన ఈ వీడియోను ప్రజలు షాక్ కు గుర‌వుతున్నారు. నెటిజ‌న్లు కామెంట్లు, షేర్ల‌తో హోరెత్తిస్తున్నారు. ఓల్గాను ‘సూపర్ వుమన్’ అని కీర్తిస్తున్నారు.

Also Read:  అప్పటి పాట..ఆ చిన్నారి గాయకుడు పాడితే..ఇప్పటికీ కొత్తగా..నెటిజన్లు ఫిదా!

యాసిడ్ గా మారిన న‌దిలోని నీరు.. తాగితే అంతే సంగ‌తులు.. షాకింగ్ రీజ‌న్

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి