AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Style: వయసు పెరుగుతున్నా.. మీరు అందంగా మెరవాలంటే.. ఈ సింపుల్ టిప్స్ మీకోసం..

రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను జోడించడం ద్వారా ఆరోగ్యకరమైన చర్మంతో పాటు.. జుట్టు రంగు మారకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించే అవకాశాలు..

Life Style: వయసు పెరుగుతున్నా.. మీరు అందంగా మెరవాలంటే.. ఈ సింపుల్ టిప్స్ మీకోసం..
Beauty Tips
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 14, 2022 | 7:34 PM

చాలా మంది వృద్ధ వయసులో యంగ్ గా కన్పించాలని చాలా తాపత్రయం పడుతుంటారు. దీని కోసం అవసరమైతే కొన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు. కొంతమంది అయితే ముసలి వయసు వచ్చినా.. పొడుచుగా కనబడుతుంటారు. అలాంటివారిని చూసి వారి లైఫ్ స్టైల్ తెలుసుకుని ఫాలో అయ్యేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరికొంతమంది మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడతారు. వాటివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కాని వృద్ధాప్యాంలోనూ యంగ్ గా కన్పించాలంటే లైఫ్ స్టైల్ లో స్వల్ప మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు. వృద్ధాప్యం అనేది సహజంగా మనిషి జీవితంలో ఓ వయస్సుకు వచ్చాక వచ్చే ప్రక్రియ. సమయం, వయస్సుతో పాటు.. వాటి ప్రభావాలు శరీరంపై వృద్ధాప్య సంకేతాలను చూపించడం ప్రారంభిస్తాయి. చర్మం నుంచి జుట్టు వరకు శరీరం సహజ ప్రక్రియల వరకు ప్రతిదీ క్రమంగా మార్పులకు లోనవుతుంది. అయితే జీవనశైలి చిన్న చిన్న మార్పుల ద్వారా వృద్ధాప్యంలో వచ్చే ఆనవాళ్లను దూరం చేసుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను జోడించడం ద్వారా ఆరోగ్యకరమైన చర్మంతో పాటు.. జుట్టు రంగు మారకుండా ఉంటుందని సూచిస్తున్నారు. దీనివల్ల వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.

యోగా, రన్నింగ్, వాకింగ్ తో పాటు వ్యాయామం వంటివి చేయడం ద్వారా యంగ్ గా కన్పించవచ్చు. శారీరక శ్రమ శరీరానికి శక్తినివ్వడంతో పాటు.. యవ్వనంగా కనిపించడానికి దోహదపడుతుంది. ఒత్తిడికి లోనుకాకుండా.. సంతోషంగా ఉండటం ద్వారా మనస్సు రిఫ్రెష్ అవుతుంది. తద్వారా వృద్ధాప్యంలో వచ్చే ఆనవాళ్లు కొంత ఆలస్యమవుతాయి.

ఇవి కూడా చదవండి

సమయానికి నిద్రపోకపోయినా త్వరగా వృద్ధాప్య లక్షణాలు వస్తాయి. నిర్ధిష్ట సమయం నిద్రపోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడం ద్వారా యవ్వనంగా కన్పించవచ్చు. అయితే రోజువారీ ఆహారంలో మార్పులు చేసుకునేటప్పుడు.. అప్పటి ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా పోషకాహార నిపుణుల గైడెన్స్ లో ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..