Winter Shower: చలికాలంలో తల స్నానం చేయడం మంచిదేనా?.. నిపుణులు ఏమంటున్నారంటే..
చలికాలంలో వేకవజామున స్నానం చేయాలంటే చాలా మంది వణికిపోతారు. చలికాలంలో రోజూ తలస్నానం చేయకపోవడం వల్ల మన శరీరం ఎన్నో ప్రయోజనాలను పొందుతుందని మీకు తెలుసా. వాటి గురించి తెలుసుకుందాం

చలికాలం ప్రారంభం కాగానే ఇంట్లోని పిల్లలు, పెద్దలు కూడా ఒక్కోసారి స్నానం చేయడానికి నిరాకరిస్తారు. చలిలో తెల్లవారుజామున స్నానాలు చేయకూడదనుకుంటున్నారు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే స్నానం చేసే వారు చాలా మంది మనలో ఉంటారు. రోజూ స్నానం చేయడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని.. మీరు తరచుగా వినే ఉంటారు. కానీ, ఈరోజు ఈ ఆర్టికల్‌లో మీరు ఇంతకు ముందు చదవని లేదా వినని విభిన్నమైన విషయాన్ని మీకు చెప్పబోతున్నాం. నిజానికి వింటర్ సీజన్‌లో రోజూ తలస్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవును, రోజూ స్నానం చేయకపోవడం వల్ల మన శరీరం శీతాకాలంలో అనేక ప్రయోజనాలను పొందుతుంది. వాటి గురించి తెలుసుకుందాం..
చర్మ రక్షణకు..
చలికాలంలో రోజూ తలస్నానం చేస్తే చర్మం అలర్జీకి గురవుతుంది. ఎందుకంటే ఇది అవసరమైన దానికంటే ఎక్కువ తేమను పొందడం వల్ల ఇలా జరుగుతుంది. డెర్మటాలజిస్ట్‌లు అందించిన సమాచారం ప్రకారం, రోజూ స్నానం చేయడం మురికిగా ఉండటం వల్ల కాదని, సమాజంలో మంచిగా కనిపించడం వల్లనో లేదా సమాజం ఒత్తిడి వల్లనో కాదు. చర్మం తనంతట తానుగా శుభ్రం చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైందని పేర్కొన్నారు. జిమ్‌కు వెళ్లకుండా, మురికి మట్టిలో ఉండటం, రోజూ స్నానం చేయాల్సిన అవసరం లేదని అంటారు.
రోజూ స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది
సాధారణంగా చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. ఎక్కువ సేపు వేడి నీళ్లలో స్నానం చేయడం వల్ల చర్మం దెబ్బతింటుంది. మన చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే సహజ నూనెలు శరీరం నుంచి వెళ్లిపోయాయి. శరీరంలో తయారైన ఈ సహజ నూనెలు శరీరాన్ని తేమగా, చర్మానికి రక్షణగా ఉంచుతాయి. మీరు రోజూ వేడి నీటితో స్నానం చేస్తే, 5 నుంచి 8 నిమిషాల్లో మీ స్నానాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
గోళ్లు పాడవుతాయి
రోజూ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల గోళ్లు పాడవుతాయి. స్నానం చేసేటప్పుడు, మన గోర్లు నీటిని పీల్చుకుంటాయి. ఆపై అవి మృదువుగా మారి విరిగిపోతాయి. వేడి నీటిలో స్నానం చేయడం వల్ల గోళ్లలోని సహజ నూనె తొలగిపోతుంది. దీని కారణంగా అవి పొడిగా, బలహీనంగా మారుతాయి.
పొడి చర్మాన్ని దూరం చేసుకోవాలంటే..
చలికాలంలో పొడి చర్మాన్ని దూరం చేసుకోవాలంటే స్నానానికి ముందు వేసుకునే బాడీ ప్యాక్స్ కూడా చక్కగా ఉపయోగపడతాయి. ఈ క్రమంలో కప్పు శెనగపిండిలో చిటికెడు పసుపు వేసి.. కొద్దికొద్దిగా పెరుగు లేదా పాలు కలుపుతూ పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు శరీరానికి పట్టించి.. కాసేపటి తర్వాత మృదువుగా రుద్దుకోవాలి. ఇలా అరగంటయ్యాక శరీరాన్ని శుభ్రం చేసుకొని ఆపై స్నానం చేయాలి. ఈ పద్ధతిని రోజూ స్నానం చేసే ముందు అలవాటు చేసుకోవడం వల్ల చల్లగాలులకు చర్మం పొడిబారకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే ఈ బాడీ ప్యాక్ చర్మాన్ని శుభ్రం చేస్తుంది కూడా!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం




