AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యాభర్తల మధ్య దూరం పెంచుతున్న కారణాలు ఇవే.. ఈ చిన్న తప్పులు దిద్దుకుంటే చాలు..!

వివాహం అనేది జీవితంలో అత్యంత కీలకమైన బంధం. కానీ చిన్న చిన్న కారణాల వల్లనే ఈ బంధం బలహీనపడే ప్రమాదం ఉంటుంది. అన్యోన్యతలో లోపం, మార్పులను అంగీకరించకపోవడం, కమ్యూనికేషన్ లోపం లాంటి అంశాలు విడాకులకు దారితీస్తాయి. ఈ అంశాలను ముందే గుర్తిస్తే బంధాన్ని రక్షించుకోవచ్చు.

భార్యాభర్తల మధ్య దూరం పెంచుతున్న కారణాలు ఇవే.. ఈ చిన్న తప్పులు దిద్దుకుంటే చాలు..!
Couple
Prashanthi V
|

Updated on: Jun 30, 2025 | 6:02 PM

Share

ఎవరి జీవితంలోనైనా వివాహం ఒక ముఖ్యమైన మలుపు. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా భార్యాభర్తల మధ్య దూరం పెంచుతూ.. సంబంధాన్ని విడాకుల దిశగా నడిపిస్తాయి. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలను గుర్తించడం ద్వారా బంధాన్ని బలపరచవచ్చు.

మౌనమే బంధానికి విఘాతం

వివాహ బంధంలో భావోద్వేగాలను పంచుకోకపోవడం చాలా సాధారణమైన ప్రమాదకరమైన విషయం. ఒకరు ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వాటిని బయటపెట్టకుండా వదిలేయడం అన్యోన్యతను దెబ్బతీస్తుంది. ఎక్కువ కాలం ఈ మౌనం పరస్పర అవగాహనను తగ్గించి అనుభూతుల బంధాన్ని బలహీనపరుస్తుంది. భావోద్వేగపూరితమైన మద్దతు ఇవ్వాలంటే.. ఒకరినొకరు నిర్భయంగా మాట్లాడుకునే వాతావరణాన్ని కల్పించుకోవాలి.

బంధం బలోపేతానికి ప్రయత్నం

బంధం బలోపేతానికి ఇద్దరిలో ఒకరే ప్రయత్నిస్తే అది సరిగా పని చేయదు. ఎప్పటికప్పుడు ఒకే వ్యక్తి మానసికంగా ఎక్కువ భారాన్ని మోస్తూ ఉంటే ఆ వ్యక్తిలో నిరాశ పెరుగుతుంది. సంబంధం అభివృద్ధి చెందాలంటే.. ఇద్దరూ మానసిక స్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉంది. ఒకరి పట్ల మరొకరి బాధ్యత తీసుకోవడమే కాకుండా పరస్పరంగా తోడ్పాటు ఇవ్వాలి.

కంఫర్ట్ జోన్‌ లో చిక్కుకున్న ప్రేమ

కాలం గడుస్తున్న కొద్దీ సంబంధం మానసికంగా స్థిరపడిపోతుంది. అయితే అదే స్థితి కొన్నిసార్లు విసుగుకు దారితీస్తుంది. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని తీసుకురావడమే సంబంధానికి ప్రాణం. శారీరక సాన్నిహిత్యానికి మించిన భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవాలి. కొత్త రెస్టారెంట్లు, హాలిడే ట్రిప్స్, లేదా సాధారణంగా కలిసి చేయగలిగే కొత్త విషయాలు బంధాన్ని మళ్లీ ఉత్సాహభరితంగా మారుస్తాయి.

అవగాహన లోపం

జీవితంలో మార్పులు తప్పనిసరి. అవి కెరీర్ పరంగా కావచ్చు, కుటుంబ బాధ్యతల వల్ల కావచ్చు, లేదా శారీరక, మానసిక మార్పుల వల్ల కావచ్చు. భాగస్వాములుగా ఈ మార్పులను అర్థం చేసుకొని.. ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం చాలా అవసరం. ఒకరి ఎదుగుదలను మరొకరు అంగీకరించకపోతే బంధం బలహీనపడుతుంది. వ్యక్తిగత లక్ష్యాలను పక్కన పెట్టి కలిసి ఎదగాలనే దృక్పథాన్ని తిరిగి నిర్మించుకోవాలి.

దిశ లేకపోవడం కూడా ప్రమాదమే

బహుశా చాలా మంది గుర్తించని.. కానీ ముఖ్యమైన విషయం ఒకటుంది. అది జంటగా జీవిత లక్ష్యం లేకపోవడం. కలిసి ముందుకు వెళ్లే స్పష్టమైన దారి లేకపోతే.. ఏ బంధమైనా తాత్కాలికంగానే కొనసాగుతుంది. అందువల్ల ఒకే దిశలో ప్రయాణించడానికి ఉమ్మడి లక్ష్యాలు, అభిరుచులు, ఒకేలాంటి జీవన విధానం కలిగి ఉండటం చాలా అవసరం.

వివాహ సంబంధంలో విడిపోవడం అనేది ఒక్కసారిగా జరిగే విషయం కాదు. అది చిన్న చిన్న అనవసర గ్యాప్‌ లుగా మొదలై పెద్ద పరిణామానికి దారి తీస్తుంది. స్పందన లోపం, ఆసక్తి తగ్గడం, మార్పులను అర్థం చేసుకోలేకపోవడం ఇవన్నీ కలిసి సంబంధాన్ని బలహీనంగా మారుస్తాయి. అయితే ఈ విషయాలను ముందే గుర్తించి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తే బంధాన్ని మరింత బలంగా మార్చవచ్చు.