AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరూ వేడి నీటితో తల స్నానం చేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా..

తల స్నానం చేసేటప్పుడు నీటి ఉష్ణోగ్రతపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. వారానికి ఎన్నిసార్లు తల స్నానం చేయాలి? ఏ షాంపూ, కండిషనర్ వాడటం మంచిది? వంటి విషయాలు తప్పక తెలుసుకోవాలి. వేడి నీటితో తల స్నానం చేసే అలవాటు ఉన్నట్లయితే దీని వల్ల మీ జుట్టుకు ఎన్ని రకాల సమస్యలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

మీరూ వేడి నీటితో తల స్నానం చేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా..
Hair Bath Tips
Srilakshmi C
|

Updated on: Jan 24, 2026 | 8:35 PM

Share

జుట్టు సంరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ముఖ్యంగా తల స్నానం చేసేటప్పుడు నీటి ఉష్ణోగ్రతపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. వారానికి ఎన్నిసార్లు తల స్నానం చేయాలి? ఏ షాంపూ, కండిషనర్ వాడటం మంచిది? వంటి విషయాలు తప్పక తెలుసుకోవాలి. వేడి నీటితో తల స్నానం చేసే అలవాటు ఉన్నట్లయితే దీని వల్ల మీ జుట్టుకు ఎన్ని రకాల సమస్యలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

వేడి నీటితో తల స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

  • మన తలపై చర్మంలో సహజ నూనెలు ఉంటాయి. ఇవి మన జుట్టును పోషించి, మెరిసేలా చేస్తాయి. వేడి నీటితో జుట్టును కడుక్కోవడం వల్ల ఈ నూనెలు తొలగిపోతాయి. ఇది జుట్టు పొడిబారడానికి దారితీస్తుంది.
  • వేడి నీరు సాధారణ జుట్టు కంటే రంగులద్దిన జుట్టుకు ఎక్కువ హానికరం. ఇది జుట్టు రంగు వెలిసిపోయేలా చేస్తుంది. దీనివల్ల రంగు మసకబారుతుంది. జుట్టు నిస్తేజంగా కనిపిస్తుంది.
  • జుట్టును వేడి నీటితో స్నానం చేయడం వల్ల తల చర్మం పొడిబారి, చుండ్రు, దురద, చికాకు కలిగిస్తుంది.
  • వేడి నీరు తలకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. జుట్టు రాలిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.
  • పొడిబారిన తల చర్మం వల్ల జుట్టు మూలాలు బలహీన పడుతుంది. దీంతో జుట్టు ఊడిపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల అధికంగా జుట్టు రాలడం జరుగుతుంది.
  • తలస్నానం చేయడానికి తరచూ వేడి నీటిని ఉపయోగించడం వల్ల మీ జుట్టు మెరుపు తగ్గుతుంది.
  • వేడి నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టు కుదుళ్లు తెరచుకునేలా చేస్తుంది. దీంతో జుట్టు క్యూటికల్స్ కెరాటిన్, లిపిడ్‌లను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

స్నానానికి ఏ నీరు మంచిది ?

వేడి నీరు జుట్టుకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి స్నానం చేయడానికి గోరువెచ్చని నీటిని వాడటం మంచిది. ఇది మీ తలని పూర్తిగా శుభ్రపరచడమే కాకుండా, జుట్టు దెబ్బతినకుండా కూడా నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.