Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Screen Time: రోజంతా స్క్రీన్‌కు అతుక్కుపోతున్నారా? మెదడుపై తీవ్ర ప్రభావం.. ఈ 7 అలవాట్లే కాపాడగలవు

నేటి డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారాయి. అయితే, అధిక స్క్రీన్ సమయం మన కళ్ళపైనే కాకుండా, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మానసిక ఆరోగ్యం, నిద్ర, ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. ఈ వ్యసనం నుంచి బయటపడి, మీ మెదడును రక్షించుకోవడానికి కొన్ని కీలక నివారణ చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Screen Time: రోజంతా స్క్రీన్‌కు అతుక్కుపోతున్నారా?  మెదడుపై తీవ్ర ప్రభావం.. ఈ 7 అలవాట్లే కాపాడగలవు
Digital Detox For Brain Health
Follow us
Bhavani

|

Updated on: Jun 11, 2025 | 6:23 PM

అధిక స్క్రీన్ సమయం మెదడులోని రసాయన సమతుల్యతను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా డోపమైన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఇది అడిక్షన్ (వ్యసనం) లాంటి లక్షణాలకు దారితీస్తుంది. నిద్రలేమి, ఏకాగ్రత లోపం, చిరాకు, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి. చిన్నపిల్లల్లో అయితే మెదడు అభివృద్ధిపై కూడా దుష్ప్రభావం చూపుతుంది. స్క్రీన్ నుంచి వచ్చే నీలి కాంతి నిద్రను నియంత్రించే మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది.

డిజిటల్ డిటాక్స్  సమయం :

రోజూ కొంత సమయం పాటు అన్ని స్క్రీన్‌లకు దూరంగా ఉండండి. ఇది మీ మెదడుకు విశ్రాంతినిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే, రాత్రి నిద్రపోవడానికి ముందు స్క్రీన్ వాడకాన్ని తగ్గించండి.

నిద్రవేళ నియమం :

నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్‌లు, ట్యాబ్‌లు, టీవీలు చూడటం మానేయండి. ఇది సహజ నిద్ర విధానాలకు సహాయపడుతుంది.

“60-20-20 నియమం” పాటించండి :

ప్రతి 20 నిమిషాల స్క్రీన్ సమయం తర్వాత, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడండి. ఇది కళ్ళకు విశ్రాంతినిస్తుంది. కళ్ళ ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఆరుబయట గడపండి :

ఇంట్లో ఉండి స్క్రీన్‌లకే అతుక్కుపోకుండా, బయట గడపడానికి ప్రయత్నించండి. ఆటలు ఆడటం, నడవడం, ప్రకృతితో సమయం గడపడం వంటివి చేయండి. ఇది మెదడును ఉత్తేజపరుస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

స్క్రీన్ టైమ్ ట్రాకింగ్ :

మీ డివైజ్‌లలో ఉండే స్క్రీన్ టైమ్ ట్రాకింగ్ యాప్‌లను ఉపయోగించి మీరు ఎంత సమయం స్క్రీన్ ముందు గడుపుతున్నారో తెలుసుకోండి. ఇది మీ వినియోగాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

“నో స్క్రీన్” జోన్‌లు :

ఇంట్లో కొన్ని ప్రదేశాలను (ఉదాహరణకు, బెడ్‌రూమ్, డైనింగ్ టేబుల్) “నో స్క్రీన్” జోన్‌లుగా ప్రకటించండి. ఆ ప్రదేశాలలో డిజిటల్ పరికరాలను వాడకుండా ఉండండి.

ఆప్తులతో గడపండి :

స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవడానికి పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, కొత్త హాబీలు నేర్చుకోవడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడటం వంటి ప్రత్యామ్నాయ కార్యకలాపాలను ఎంచుకోండి.

ఈ చిట్కాలను పాటించడం ద్వారా స్క్రీన్ సమయం ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. మీ మెదడు ఆరోగ్యాన్ని, మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు.

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో