Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mini Thailand: థాయ్‌లాండ్‌ అందాలను మన దేశంలోనే చూసెయ్యండి.. మినీ థాయ్‌లాండ్‌ ఎక్కడ ఉందంటే..?

ప్రస్తుతం థాయ్‌లాండ్‌కు వెళ్లడానికి మీ వద్ద తగిన బడ్జెట్ లేకపోతే.. భారతదేశంలోని ఓ ప్రాంతం దీని అందం కారణంగా 'మినీ థాయ్‌లాండ్' గా ప్రసిద్దిగంసింది. ఈ ప్రదేశాన్ని తక్కువ ఖర్చుతోనే సందర్శించవచ్చు. ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. సాధారణంగా హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి అందాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఎత్తైన పర్వతాలు, ప్రతిచోటా పచ్చదనం మధ్య గడపడం ఎవరికైనా ఉత్తమ అనుభవం. ఈ రోజు హిమాచల్‌లోని 'మినీ థాయ్‌లాండ్' అని పిలువబడే ఆ ప్రదేశం గురించి తెలుసుకుందాం..

Mini Thailand: థాయ్‌లాండ్‌ అందాలను మన దేశంలోనే చూసెయ్యండి.. మినీ థాయ్‌లాండ్‌ ఎక్కడ ఉందంటే..?
Jibhi Mini Thailand
Follow us
Surya Kala

|

Updated on: Jun 15, 2024 | 8:49 PM

విదేశాలకు వెళ్లాలనే కల ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక సమయంలో పుడుతుంది. విదేశాల్లో నివసించడానికి లేదా ఉద్యోగం కోసం వెళ్ళడానికి వీలుకాకపోతే కనీసం నచ్చిన దేశాల్లో పర్యటించాలని కోరుకుంటారు. ప్రస్తుతం థాయ్‌లాండ్ యువతలో బాగా ప్రాచుర్యం పొందిన పర్యాటక గమ్యస్థానంగా మారింది. వాస్తవానికి ఇక్కడ సహజ సౌందర్యం ప్రదేశాలు మాత్రమే కాదు.. సందర్శనతో పాటు థ్రిల్‌ను నింపే అనేక ప్రదేశాలు ఉన్నాయి. అందువల్ల ప్రముఖుల నుంచి సాధారణ భారతీయ పర్యాటకులు సందర్శించడానికి ఇష్టమైన ప్రదేశాలలో థాయిలాండ్ ఒకటి. ప్రస్తుతం థాయ్‌లాండ్‌కు వెళ్లడానికి మీ వద్ద తగిన బడ్జెట్ లేకపోతే.. భారతదేశంలోని ఓ ప్రాంతం దీని అందం కారణంగా ‘మినీ థాయ్‌లాండ్’ గా ప్రసిద్దిగంసింది. ఈ ప్రదేశాన్ని తక్కువ ఖర్చుతోనే సందర్శించవచ్చు. ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది.

సాధారణంగా హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి అందాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఎత్తైన పర్వతాలు, ప్రతిచోటా పచ్చదనం మధ్య గడపడం ఎవరికైనా ఉత్తమ అనుభవం. ఈ రోజు హిమాచల్‌లోని ‘మినీ థాయ్‌లాండ్’ అని పిలువబడే ఆ ప్రదేశం గురించి తెలుసుకుందాం..

హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ ప్రదేశం మినీ థాయ్‌లాండ్

‘మినీ థాయ్‌లాండ్’ని సందర్శించాలనుకుంటే.. బ్యాగ్‌ని సర్దుకుని హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న జిభి వైపు వెళ్ళండి. దీనిని భారతదేశపు ‘మినీ థాయిలాండ్’ అని పిలుస్తారు. ఇక్కడ కూడా రెండు భారీ బండరాళ్లు మధ్య నది ప్రవహిస్తోంది. చూడడానికి ఇది థాయిలాండ్ ద్వీపంలా అనిపిస్తుంది. ఈ రెండు భారీ బండరాళ్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

చాలా అందమైన జలపాతం దృశ్యం

జిభిలో అందమైన పర్వతాలు, ప్రకృతి పచ్చదనం మధ్య అందమైన జలపాతాలు ప్రకృతి గీసిన చిత్రాన్ని ఆనందించవచ్చు. ఇక్కడ మీరు శాంతి, ప్రశాంతత మధ్య ప్రకృతిని దగ్గరగా చూస్తూ మానసికంగా ఎంతో రిలాక్స్ అనుభవించవచ్చు.

ఆధ్యాత్మిక శాంతి

జిభిలోని భారీ దట్టమైన దేవదారు వృక్షాలు, పచ్చని పర్వతాలు, నదులు, సరస్సులు, జలపాతాల ప్రకృతి అందాల దృశ్యాలు హృదయంలో నిలిచిపోతాయి. అంతేకాదు ఈ ప్రాంతానికి వెళ్ళడం ద్వారా ఆధ్యాత్మిక శాంతిని కూడా అనుభవిస్తారు. ఎందుకంటే ఈ ప్రదేశం అందమైన దేవాలయాలకు కూడా ప్రసిద్ధి చెందింది.

జిభికి ట్రిప్ ప్లాన్

సోలోగా ఈ ప్రాంతానికి ట్రిప్ ప్లాన్ చేసినా.. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించడం చేయడానికి జీబీ బెస్ట్ ఎంపిక. అయితే జిబికి వెళ్లి కొన్ని రోజుల పాటు సందడి చేయవచ్చు. నగరాల్లో రణగొణధ్వనుల సందడి నుంచి ప్రకృతి మధ్య అందమైన సమయాన్ని గడపవచ్చు. హిమాచల్‌ ప్రదేశ్ లోని శృంగి రిషి ఆలయం, సెరోల్సర్ సరస్సు, జిభి జలపాతం, జలోరి పాస్ వంటి ప్రదేశాలను అన్వేషించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..