Men Health: మగాళ్లు బీకేర్‌ఫుల్..! అదే పనిగా ఫోన్ వాడితే ఆ విషయంలో వీక్ అవుతారంట జాగ్రత్త..
Men Health-mobile phone: ఆధునిక ప్రపంచంలో మొబైల్ ఫోన్ల వినియోగం అత్యధికంగా పెరిగింది. ప్రస్తుతం ఫోన్ అత్యవసర పరికరంగా మారింది. అందుకే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ కచ్చితంగా కనిపిస్తోంది. అయితే, అత్యధికంగా ఫోన్ వినియోగం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా.. మొబైల్ ఫోన్లు ప్రజలను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశంపై..

Men Health-mobile phone: ఆధునిక ప్రపంచంలో మొబైల్ ఫోన్ల వినియోగం అత్యధికంగా పెరిగింది. ప్రస్తుతం ఫోన్ అత్యవసర పరికరంగా మారింది. అందుకే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ కచ్చితంగా కనిపిస్తోంది. అయితే, అత్యధికంగా ఫోన్ వినియోగం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా.. మొబైల్ ఫోన్లు ప్రజలను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశంపై ఇటీవల జరిపిన అధ్యయనంలో కొన్ని ఆశ్చర్యకరమైన, భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి. గతంలోనూ ఇలాంటి అధ్యయనాలు జరిగినా.. ఈసారి పురుషుల ఆరోగ్యంపై దృష్టి సారించడంతో పలు ఆందోళనకర అంశాలు తెరపైకి వచ్చాయి. మొబైల్ ఫోన్ వాడకం పురుషులలో స్పెర్మ్ నాణ్యత.. పరిమాణాన్ని తగ్గిస్తుంది. అతిగా ఫోన్ వాడకం పురుషుల్లో వంధ్యత్వానికి కారణమవుతుందన్న సంగతి తెలిసిందే. విద్యుదయస్కాంత వికిరణాన్ని ఉత్పత్తి చేసే మొబైల్ ఫోన్‌ల వాడకం స్పెర్మ్‌పై ప్రభావం చూపుతుందని.. క్రమంగా మొత్తం స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది.
అధ్యయనంలో ఏయే అంశాలు పరిగణలోకి తీసుకున్నారు..?
స్విట్జర్లాండ్‌లోని జెనీవా విశ్వవిద్యాలయానికి చెందిన బృందం 2005 – 2018 మధ్య నియమించబడిన 18 నుంచి 22 సంవత్సరాల వయస్సు గల 2,886 మంది పురుషుల డేటా ఆధారంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించేవారిలో స్పెర్మ్ ఏకాగ్రత తక్కువగా ఉన్నట్లు డేటా కూడా చూపింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాల ప్రకారం.. ఒక వ్యక్తి స్పెర్మ్ సాంద్రత ఒక మిల్లీలీటర్‌కు 15 మిలియన్ కంటే తక్కువగా ఉంటే, పునరుత్పత్తికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుంది. అలాగే, స్పెర్మ్ గాఢత ఒక మిల్లీలీటర్‌కు 40 మిలియన్ కంటే తక్కువగా ఉంటే, సంతానోత్పత్తి అవకాశాలు తగ్గుతాయి.
గత యాభై ఏళ్లుగా స్పెర్మ్ నాణ్యత క్షీణించిందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. స్పెర్మ్ కౌంట్ ప్రతి మిల్లీలీటర్‌కు సగటున 99 మిలియన్ స్పెర్మ్ నుంచి 47 మిలియన్లకు పడిపోయినట్లు నివేదించబడింది. ముఖ్యంగా ఫోన్ తోపాటు పర్యావరణ కారకాలు, ఆహారం, మద్యపానం, ఒత్తిడి, ధూమపానం వంటి జీవనశైలి అలవాట్ల ఫలితంగా అధ్యయనాన్ని రూపొందించారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..