Office Chairs: రూ.2000లోపు ఆఫీసు కుర్చీలు ఇవే.. సౌకర్యంతో పాటు ఆరోగ్యం మీ సొంతం..
ఆఫీసు అయినా, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఎక్కువ గంటలు పనిచేసేవారు తప్పనిసరిగా చైర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో బడ్జెట్ విషయాన్ని మదిలో ఉంచుకోవాలి. తక్కువ ఖర్చుతో మంచి సౌకర్యవంతమైన కుర్చీని వెతకగలగాలి.

ఎక్కువ గంటల పాటు కూర్చొని పనిచేసేవారికి కుర్చి చాలా ముఖ్యం. ప్రధానంగా కంప్యూటర్ ముందు పనిచేసేవారు వారి కూర్చొనే చైర్ ఎంత సౌకర్యవంతంగా, ఎంత సపోర్టివ్ గా ఉంటే అంత బాగా పనిచేసుకొనే వీలుంటుంది. మీరు కూర్చొనే చైర్ సక్రమంగా లేకపోతే మీరు పని మీద ఎక్కువసేపు ఫోకస్ పెట్టలేరు. అలాగే పలు రకాల ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి. ముఖ్యంగా వెన్ను నొప్పి, మెడ నొప్పి వంటివి వస్తాయి. అందుకే మీరు కూర్చొనే విధానం, చైర్ల ఎంపిక విషయంగా జాగ్రత్త వహించాలి. ఆఫీసు అయినా, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఎక్కువ గంటలు పనిచేసేవారు తప్పనిసరిగా చైర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో బడ్జెట్ విషయాన్ని మదిలో ఉంచుకోవాలి. తక్కువ ఖర్చుతో మంచి సౌకర్యవంతమైన కుర్చీని వెతకగలగాలి. మార్కెట్లో పెద్ద సంఖ్యలో అందుబాటులో చైర్లలో మీకు అనువైన ధరలో మంచి ఆఫీసు కుర్చీలను మీకు పరిచయం చేస్తున్నాం. కేవలం రూ.2000లోపు ధరలోనే సౌకర్యవంతమైన కుర్చీలు మార్కెట్లో ఉన్నాయి. రండి వాటిపై ఓ లుక్కేద్దాం..
గోయల్సన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ చైర్..
గోయల్‌సన్ ఎగ్జిక్యూటివ్ ఎర్గోనామిక్ విజిటర్ కంప్యూటర్ చైర్ అనేది మీ ఆఫీసు వినియోగానికి బెస్ట్ ఎంపికగా చెప్పొచ్చు. ఇది స్టైలిష్ గా ఉండటంతో పాటు సౌకర్యవంతమైన సీటింగ్ ను అందిస్తుంది. దీని తయారీ వినియోగించిన వస్తువులు కూడా అధిక-నాణ్యతతో చేసినవి. ఈ కుర్చీలో హైయిట్ ఎడ్జస్ట్ మెంట్ కు అవకాశం ఉంటుంది. అటు ఇటు కదలడానికి 360-డిగ్రీల స్వివెల్ బేస్ ఉన్నాయి. ప్యాడెడ్ సీటు, బ్యాక్‌రెస్ట్ మిమ్మల్ని ఎక్కువ గంటలు కూర్చోవడానికి అవకాశం కల్పిస్తాయి. దీని ధర ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ లో రూ. 18,49గా ఉంది.
ర్యాటిసన్ ఆఫీస్ చైర్..
మీ వర్క్‌ప్లేస్ లేదా హోమ్ వర్క్‌స్పేస్ కోసం, రేటిసన్ కంఫర్టబుల్ కంప్యూటర్/లైబ్రరీ/విజిటర్ చైర్ అనువైన ఎంపిక. ఈ కుర్చీ నిర్మాణంలో అధిక-నాణ్యత పదార్థాలు ఉపయోగించారు. ఇది బలమైన మెటల్ ఫ్రేమ్, ఫాబ్రిక్ తో తయారైంది. దీనిలో కూడా హైయిట్ అడ్జస్ట్ మెంట్, అటు ఇటు కదలడానికి 360-డిగ్రీల స్వివెల్ బేస్ కలిగి ఉంది. ఎక్కువసేపు కూర్చోవడం కోసం, ప్యాడెడ్ సీటు, బ్యాక్‌రెస్ట్ సౌకర్యాన్ని అందిస్తాయి. అదనపు సౌలభ్యం కోసం, కుర్చీ టిల్ట్ ఫీచర్, లాకింగ్ మెకానిజంను కూడా కలిగి ఉంటుంది. ఈ కుర్చి ధర అమెజాన్ లో రూ. 18,99గా ఉంది.
డిజియోనిక్స్ స్టెయిన్‌లెస్ స్టీల్ లెగ్స్ డిటాచబుల్ చైర్..
డిజియోనిక్స్ స్టెయిన్‌లెస్ స్టీల్ డిటాచబుల్ రెస్టారెంట్/విజిటర్ చైర్ అనేది మీ ఆఫీసు లేదా రెస్టారెంట్ అవసరాల కోసం బెస్ట్ ఆప్షన్. ఇది ధృడమైన స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్ కలిగి ఉంది. కుషన్ సీటు సౌకర్యవంతంగా ఉంటుంది. కర్వడ్ బ్యాక్‌రెస్ట్, ఆర్మ్‌రెస్ట్‌లతో ఎర్గోనామిక్ డిజైన్‌తో ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వారికి మంచి కంఫర్ట్ ని ఇస్తుంది. కుర్చీలో నాన్-స్లిప్ బేస్ కూడా ఉంది, అది నేలపై కదలకుండా ఉండేలా చేస్తుంది. ఇది లాబీల్లో, వెయిటింగ్ హాళ్లలో, రెస్టారెంట్లలోనూ ఎక్కువగా వినియోగిస్తారు. దీని ధర అమెజాన్ లో కేవలం రూ. 999గా ఉంది.
ఏఎస్ఆర్ ఆఫీస్ చైర్..
మీ ఆఫీసు లేదా హోమ్ వర్క్‌స్పేస్ కోసం ఈ ఏఎస్ఆర్ చైర్ బెస్ట్ ఎంపిక. ఇది దృఢమైన మెటల్ ఫ్రేమ్ కలిగి ఉంది. ప్యాడెడ్ సీటు, బ్యాక్‌రెస్ట్ ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడానికి బాగా ఉపకరిస్తాయి. అలాగే టిల్ట్ ఫంక్షన్, లాకింగ్ మెకానిజం అదనపు సౌలభ్యాన్ని జోడిస్తాయి. ఈ కుర్చీ క్లాసిక్ డిజైన్ ఇంటి కార్యాలయాల నుండి వాణిజ్య కార్యస్థలాల వరకు వివిధ రకాల సెట్టింగ్‌లకు అనువైనదిగా చేస్తుంది. దీని ధర అమెజాన్ లో రూ. 1,849గా ఉంది.
చిల్లీ బిల్లీ స్టీల్ చైర్..
చిల్లీ బిల్లీ లెథెరెట్ చైర్ డిజైన్, దీని సౌకర్యవంతమైన కుషనింగ్ ఎక్కువ గంటలు కూర్చోవడానికి బాగా ఉపకరిస్తుంది. ధృడమైన మెటల్ ఫ్రేమ్ తో ఇది తయారైంది. ఈ కుర్చీ కాంపాక్ట్ సైజు, తేలికైన డిజైన్ మీ వర్క్‌స్పేస్ బెస్ట్ చాయిస్ అని చొప్పొచ్చు. దీని ధర అమెజాన్ లో రూ. 14,99గా ఉంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..