AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌ స్పెషల్‌.. మామిడి పళ్లతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. ఇది ఫ్రీ రాడికల్స్ ప్రభావాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మ కణాలు దెబ్బతినకుండా నివారిస్తుంది. మామిడి పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయ పడుతుంది. అయితే, మామిడి పండ్లను ఎల్లప్పుడూ మితంగా తినాలి.

సమ్మర్‌ స్పెషల్‌.. మామిడి పళ్లతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Mangoes
Jyothi Gadda
|

Updated on: May 14, 2025 | 9:34 PM

Share

పండ్లలో రారాజు మామిడి.. వేసవి కోసం అందరూ ఎదురు చూసేది మామిడి పండ్ల కోసమే అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సమ్మర్‌ స్పెషల్‌ మామిడి పండ్లు కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి కూడా అనేక ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. మామిడి పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. మామిడి పండ్లతో జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మామిడి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ రుగ్మతల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మామిడి పండ్లు తినటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజన్‌ వ్యాధులు దరిచేరకుండా శరీరానికి మంచి ఇమ్యూనిటి పవర్‌లా పనిచేస్తుంది. మామిడి పండ్లలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మామిడి పండ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడానికి మరియు ఆరోగ్యకరమైన హృదయనాళ వ్యవస్థకు తోడ్పడతాయి.

అంతేకాదు.. మామిడి పండ్లలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి చూపుకు మేలు చేస్తుంది. మంచి దృష్టికి విటమిన్‌ ఎ అవసరం. వయస్సు సంబంధిత కంటి వ్యాధులను నివారించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. ఇది ఫ్రీ రాడికల్స్ ప్రభావాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మ కణాలు దెబ్బతినకుండా నివారిస్తుంది. మామిడి పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయ పడుతుంది. అయితే, మామిడి పండ్లను ఎల్లప్పుడూ మితంగా తినాలి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్