భార్యాభర్తల సంబంధం కలకాలం ఉండాలంటే కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోవాల్సిందే..!

Marriage: వివాహ బంధం జీవితాంతం ఉంటుంది. దానిని ఒక అందమైన ప్రయాణంలా భావిస్తే బాగుంటుంది. లేదంటే గొడవలతో ముగుస్తుంది. అయితే బంధం గట్టిగా ఉండాలంటే

భార్యాభర్తల సంబంధం కలకాలం ఉండాలంటే కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోవాల్సిందే..!
Marriage
Follow us
uppula Raju

| Edited By: Phani CH

Updated on: Sep 08, 2021 | 4:52 PM

Marriage: వివాహ బంధం జీవితాంతం ఉంటుంది. దానిని ఒక అందమైన ప్రయాణంలా భావిస్తే బాగుంటుంది. లేదంటే గొడవలతో ముగుస్తుంది. అయితే బంధం గట్టిగా ఉండాలంటే అది ఆ దంపతులపైనే ఆధారపడి ఉంటుంది. చిన్న తప్పులు మీ సంబంధంలో పెద్ద గొడవలను సృష్టిస్తాయి. అపార్థాలను కలిగిస్తాయి. మీ బంధాన్ని బలహీనపరుస్తాయి. అందువల్ల ప్రతి దంపతులు ఈ 5 విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం ఇవే. అవేంటో ఒక్కసారి పరశీలిద్దాం.

1. వివాహ బంధంలో నమ్మకం, ప్రేమ చాలా ముఖ్యం. మీరు ఎంత బిజీగా ఉన్నా మీ భాగస్వామితో గడపడానికి సమయాన్ని కేటాయించాలి. మీ సంతోషాలు, బాధలను ఒకరినొకరు షేర్ చేసుకోవాలి. లేదంటే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. అపార్థాలు పెరుగుతాయి.

2. మీరు మీ భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నా.. వారికంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటుందని గుర్తుంచుకోండి. అక్కడ వారు కొంత సమయం గడపాలని కోరుకుంటారు. స్నేహితులతో గడపాలని, ఉద్యోగం మార్చాలని అనుకుంటారు. అప్పుడు వారికి కొంత సమయాన్ని కేటాయించాలి. అది వారికి రిఫ్రెష్‌గా అనిపిస్తుంది మీపై గౌరవం రెట్టింపవుతుంది.

3. దంపతులు ఇద్దరు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చూడకూడదు. ఇది సంబంధాన్ని పాడు చేస్తుంది. మీరిద్దరూ జీవితకాల భాగస్వాములు ఈ విషయాన్ని గుర్తుంచుకొని మెదలాలి.ఒకరినొకరు అర్థం చేసుకొని గౌరవించుకోవాలి. పరిమితులు అందరికీ తెలుసు కానీ ఆంక్షలు పెట్టవద్దు. మీ ప్రకారమే అవతలి వ్యక్తి నడుచుకోవాలని ఆశించవద్దు.

4. మీరు ఉద్యోగం చేస్తే మీ ఇంటి బాధ్యతను మీ భార్య చూసుకుంటుంది. ఇది కూడా ఒక పెద్ద పని అని గుర్తించండి. మీ భార్య గృహిణి అయితే ఆమె పనిని చిన్నదిగా చూసి ఎగతాళి చేయకండి. మిమ్మల్ని ఎలా గౌరవిస్తుందో మీరు కూడా అలాగే ఆమెను గౌరవించాలి

5. భార్యాభర్తల మధ్య బంధం కలకాలం ఉండాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం కచ్చితంగా ఉండాలి. ఏం చేసినా ఒకరికి తెలియకుండా ఒకరు చేయకూడదు. ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా ఒకరికొకరు సహకరించుకోవాలి. అది మీ బంధాన్ని కలకాలం నిలుపుతుంది.

Debit Cards: ఇంటర్నెట్‌ లేకున్నా డెబిట్‌ కార్డు వాడవచ్చు.. అందుబాటులోకి రానున్న కొత్త టెక్నాలజీ..!

AP CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి విష జ్వరాలు..!

Guess The Hero: ఈ ఫొటో రౌండప్‌లో ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడాయన ఓ క్రేజీ హీరో.