Sleeping: మధ్యాహ్నం తిన్న తరువాత నిద్రపోయే అలవాటు ఉందా? అయితే, దీనిపై ఓ లుక్కేసుకోండి..
భోజనం చేసిన తరువాత చాలా మంది కాసేపు నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రకరకాల ఇంటి పనులు చేసి అలిసిపోతారు. ఈ కారణంగా కూడా చాలా మంత్రి భోజనం చేసిన తరువాత నిద్రపోతారు. ఆయుర్వేదం ప్రకారం..

భోజనం చేసిన తరువాత చాలా మంది కాసేపు నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రకరకాల ఇంటి పనులు చేసి అలిసిపోతారు. ఈ కారణంగా కూడా చాలా మంత్రి భోజనం చేసిన తరువాత నిద్రపోతారు. ఆయుర్వేదం ప్రకారం.. తిన్న వెంటనే నిద్రపోవడం సరికాదు. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. మరి తిన్న తరువాత నిద్ర వస్తే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తిన్న వెంటనే నిద్ర పోవడం వలన శరీరంలో కొవ్వు, నీటి శాతం పెరుగుతుంది. ఇలా చేయడం వలన జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. జీవ క్రియ బలహీనపడుతుంది. మధుమేహం, ఊబకాయం, బరువు పెరగడం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు పెరుగుతాయి. ఆయుర్వేదం ప్రకారం.. వృద్దులు, పిల్లలు, శారీరక శ్రమ చేసే వ్యక్తులు దాదాపు 48 నిమిషాలు నిద్రపోవచ్చు. భోజనం చేయని వారు కూడా నిద్రపోవచ్చు అని చెబుతోంది.
అయితే, భోజనం చేసిన వెంటనే పడుకోకుండా 15-20 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోవాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా చేయడం వలన ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. తద్వారా జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. ఎసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. భోజనం చేసిన తర్వాత 100 అడుగులు నడచే విధంగా టార్గెట్ పెట్టుకోవాలి. అయితే, ఆహారం తిన్న తర్వాత భారీ వ్యాయామం చేయొద్దు.




ఎక్కువగా భోజనం చేయడం, ఆ వెంటనే నిద్రపోవడం ఆరోగ్యానికి చేటు చేస్తుంది. పొరపాటును కూడా ఇలా చేయొద్దు. ఈ తప్పును పదే పదే పునరావృతం చేస్తే అనేక శారీరక సమస్యలు వస్తాయి. తీవ్రమైన వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..